హైదరాబాద్: సీబీఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాణ ఫోన్ కాల్స్ సంచలనం రేపుతున్నాయి. యావత్ ప్రజానీకాన్ని ఈ కాల్స్ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. జేడీ ఫోన్ నుంచి టీవీ 9, ఏబీఎన్-ఆంధ్రజ్యోతి, ఎన్టీవీ, మహాటీవీ, ఈటీవీ మీడియా, టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఎక్స్ ప్రెస్ తో పాటు వాసిరెడ్డి చంద్రబాల, ఐపీఎస్ అధికారి రాముడుకు కొన్ని వందల సంఖ్యలో కాల్స్ వెళ్లాయి.  సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ ఫోన్ నుంచి మీడియా సంస్థలకు, వాసిరెడ్డి చంద్రబాలకు కాల్స్ వెళ్లిన విషయాన్ని గురువారం నాడు వైఎస్ఆర్ సీపీ నాయకులు బయటపెట్టారు. సీబీఐ జేడీ నుంచి చంద్రబాలకు 328 ఫోన్స్ కాల్సు వెళ్లాయి. అదే విధంగా టీవీ 9కు 386, మహాటీవీ ప్రతినిధికి 300కాల్సు, ఎన్టీవీకి 142, ఏబీఎన్కు 153, ఈటీవి ప్రతినిధి 14, టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఎక్స్ ప్రెస్ ప్రతినిధులకు జేడీ లక్ష్మీనారాయణ ఫోన్ నుంచి కాల్సు వెళ్లడం అందర్ని ఆశ్చర్యానికి గురి చేసింది. వీరితో పాటు సీబీఐ జేడీ నుంచి వాసిరెడ్డి చంద్రబాల కు 328కాల్స్ వెళ్లడం ఆమె ఫోన్ నుంచి ఆంధ్రజ్యోతి ఎండీ రాధాక్రిష్ణకు ఫోన్లు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.  నిబంధనల ప్రకారం ఒక దర్యాప్తు సంస్థ అధికారి అయిన జేడీ లక్ష్మీనారాయణ ఎవరితో మాట్లాడటానికి వీలు లేదు. కానీ, ఆయన ఏకంగా రాష్ర్టంలోని ఒక వర్గం మీడియా ప్రతినిధులతో వందలసార్లు ఫోన్లో సంభాషించడం సంచలనంగా మారింది. ముందు నుంచీ సీబీఐ విచారణ తీరువై వైఎస్ఆర్ పార్టీ తప్పుబడుతూనే వుంది. జగన్ విషయంలో కుట్ర జరుగుతుందంటున్నారు. వారు చెబుతున్నట్లుగానే సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ ఫోన్ లీస్టు ఉండటం అనేక అనుమానాలకు తావిస్తోంది. మీడియాతో పాటు మరో మహిళతో వందలమార్లు ఫోన్లో మాట్లాడిన జేడీపై విచారణ జరిపించాల్సిందిగా వైఎస్ఆర్ సీపీ డిమాండ్ చేస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: