కొద్ది రోజులుగా తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవి ఎంపిక విషయమై పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా ఎవరిని నియమించాలనే విషయంలో చంద్రబాబు తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. పార్టీకి చెందిన కీలక నాయకులు చాలామంది ఈ పదవిని సంపాదించాలనే ఉద్దేశంతో చంద్రబాబు వద్ద తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ చంద్రబాబు మాత్రం యువ నాయకుడికి అధ్యక్ష పదవిని కట్టబెట్టి వైసీపీకి దీటుగా తెలుగుదేశం పార్టీని తీర్చిదిద్దాలని కంకణం కట్టుకున్నారు. ఇప్పటికే అధ్యక్ష పదవి ఎంపిక విషయంలో చాలా మంది పేర్లు చంద్రబాబు పరిగణలోకి తీసుకున్నారు. అందులో ప్రస్తుత టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లోకేష్ పేరు కూడా ఉంది.

IHG's son <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=NARA LOKESH' target='_blank' title='nara lokesh-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>nara lokesh</a> takes oath as <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=MINISTER' target='_blank' title='minister-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>minister</a> - The Hindu


 కాకపోతే లోకేష్ నాయకత్వంపై టిడిపి శ్రేణుల్లో పెద్దగా నమ్మకం లేకపోవడం, 2024 ఎన్నికల్లో టిడిపి మళ్లీ గెలవాలంటే అలా పార్టీ శ్రేణులను ముందుకు నడిపించడం లోకేష్ వల్ల సాధ్యమయ్యే పని కాదు అంటూ పార్టీ నాయకులు బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. అదీ కాకుండా 2019 ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసి లోకేష్ ఓటమి చెందారు. అటువంటి వ్యక్తికి పార్టీ పగ్గాలు అప్పగిస్తే, మొదటికే మోసం వస్తుందనే అభిప్రాయం తెలుగు తమ్ముళ్లు చాలామంది వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఇదే అంశంపై చంద్రబాబు వియ్యంకుడు లోకేష్ మామయ్య బాలకృష్ణ స్పందించారు. 


తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో లోకేష్ ను ఉద్దేశించి బాలయ్య మాట్లాడారు. లోకేష్ నాయకత్వ సమర్థతపై తనకు నమ్మకం ఉందని, ఆయన పార్టీని ముందుకు నడిపించే విషయంలో సమర్థుడని, ఉన్నత విద్యను అభ్యసించిన వాడని, అలాగే అనేక అంశాలపై లోకేష్ కు  అవగాహన ఉందని, నాయకత్వ లక్షణాలు ఉన్నాయని ఆయనపై ప్రశంసలు కురిపించారు. పరోక్షంగా టిడిపి పగ్గాలు లోకేష్ కు అప్పగిస్తే ఆయన సమర్థవంతంగా పార్టీని ముందుకు తీసుకువెళ్ళగలరనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లుగా అర్థమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: