దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ పంజా విసురుతోంది. గత రెండు రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. పట్టణాల నుంచి పల్లెలకు విస్తరించిన వైరస్ గ్రామాల్లో వేగంగా వ్యాప్తి చెందుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో నిన్న ఒక్కరోజే 700కు పైగా కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రజలు చేస్తున్న తప్పుల వల్లే వైరస్ ఈ స్థాయిలో వ్యాప్తి చెందుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 
 
అన్ లాక్ 1.0 సడలింపుల్లో భాగంగా ఈ నెల 8 నుంచి కేంద్రం భారీగా సడలింపులు ఇచ్చింది. ఈ సడలింపుల వల్ల రోడ్లపై జనసంచారం గతంతో పోలిస్తే భారీగా పెరిగింది. వ్యాపార, వాణిజ్య సంస్థలు తెరచుకున్నాయి. మాస్క్ ధరించాలని..... భౌతిక దూరం పాటించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నా ప్రజలు నిర్లక్ష్యం వహిస్తున్నారు. కొందరి నిర్లక్ష్యం వల్ల వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతోంది. 
 
పట్టణాల్లో మాస్క్, భౌతిక దూరం నిబంధనలు కొంతమేర అమలవుతున్నా టైర్ 2 సిటీలు, మండలాలు, గ్రామాల్లో మాత్రం ఈ నిబంధనలు అమలు కావడం లేదు. పలు ప్రాంతాల్లో గుంపులుగుంపులుగా జనం గుమికూడుతున్నారు. మరోవైపు తూర్పుగోదావరి  జిల్లా పెదపూడి మండలంలోని గొల్లాల మామిడాడలో మే 21న ఒకరు కరోనా భారీన పడటంతో ఆ వ్యక్తి ఉంచి 222 మందికి వైరస్ నిర్ధారణ అయింది. 
 
ఒక్క మామిడాడ గ్రామంలోనే 119 మంది వైరస్ భారీన పడ్డారు. ఈ గ్రామం ఉన్న పెదపూడి మండలంలో 125 మందికి వైరస్ నిర్ధారణ అయింది. ఈ కేసు ద్వారానే చెల్లూరు పంచాయతీ సూర్యారావుపేటలో కూడా 57 మంది వైరస్ భారీన పడ్డారు. పొరుగు రాష్ట్రాల్లో సైతం పరిస్థితి ఇదే విధంగా ఉంది. తమిళనాడులో 2,141 మంది కరోనా వైరస్ భారీన పడగా బాధితుల సంఖ్య 52,334కు చేరింది. నిన్న ఒక్కరోజే 49 మంది చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోగా మృతుల సంఖ్య 625కు పెరిగింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: