వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కర్త, కర్మ, క్రియ అన్ని జగన్ అయినా, మొత్తం వ్యవహారాలు అన్నిటిని చక్కబెట్టేది మాత్రం ఆయన నీడ. ఆయన నీడ అంటే విజయ సాయి రెడ్డి. గత రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో కె.వి.పి.రామచంద్రరావు కి ఏ విధంగా అయితే ప్రాధాన్యం ఇచ్చేవారో అదేవిధంగా విజయసాయిరెడ్డికి కూడా వైసీపీలో ప్రాధాన్యం దక్కుతూ వస్తోంది. పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ అన్ని వ్యవహారాలను విజయసాయిరెడ్డి పాత్ర ఉండాల్సిందే. ఎవరినైనా జగన్ కలవాలంటే, ముందుగా విజయసాయిరెడ్డిని ప్రసన్నం చేసుకోవాల్సిందే. వైసిపి స్థాపించడానికి ముందు నుంచి విజయసాయిరెడ్డి తో జగన్ కు స్నేహం ఉంది. జగన్ కు సంబంధించిన ఆస్తుల వ్యవహారాలు అన్నిటినీ ఆడిటర్ పాత్రలో విజయసాయిరెడ్డి చక్కబెడుతూ ఉండేవారు. 

 

IHG


దీంతో ఆయనకు పార్టీలో బాగా పలుకుబడి పెరిగింది. అయితే కొద్ది రోజులుగా జగన్ ఆయనను దూరం పెడుతున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా విశాఖ ఎల్జీ పాలిమర్స్ సంఘటన జరిగిన తరువాత బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న జగన్ కారులో విజయసాయిరెడ్డి ఎక్కగా, ఆయనను దించివేసి ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నానిని ఎక్కించుకోవడంతో జగన్ ను దూరం పెడుతున్నారు అనే వార్తలు గుప్పుమంటున్నాయి. ఇక అది నిజమే అన్నట్లుగా ఆ తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి ప్రాధాన్యత పార్టీలో పెరిగింది. 

IHG


అయితే తాజాగా మంత్రుల పేషిల్లో ని వ్యవహారాల్లో విజయసాయి రెడ్డి జోక్యం పెరిగిందని , దీని కారణంగా మంత్రులు అసంతృప్తితో ఉన్నారనే గుసగుసలు ఇప్పుడు వైసీపీలో వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారం జగన్ వద్దకు కూడా చేరడంతో విజయసాయి రెడ్డి పై కాస్త అసహనంగా ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఇతర విషయాల్లో జగన్ బిజీ బిజీగా ఉండడంతో ఇప్పుడు విజయసాయిరెడ్డి వ్యవహారాన్ని కాస్తపక్కన పెట్టినట్టుగా వైసీపీలో కొంతమంది నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: