ఏకంగా అక్కడ లక్షకు పైగా కరోనా మరణాలు ఉండడంతో పాటు 35 లక్షల కరోనా కేసులు కూడా ఉన్నాయి. కరోనా వైరస్ కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో. ప్రభుత్వాలు సామర్థ్యం కంటే ఎక్కువ మొత్తంలో కరోనా పరీక్షలు చేసేందుకు సిద్ధపడుతున్న విషయం తెలిసిందే. అయితే ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో జరుగుతున్న కరోనా నిర్ధారణ పరీక్షలకు సంబంధించి తాజాగా అమెరికా వైట్ హౌస్ నుంచి ఓ ఆసక్తికర ప్రకటన విడుదలైంది. కరోనా నిర్దారిత పరీక్షల్లో ప్రపంచంలోని అన్ని దేశాల్లోకెల్లా అమెరికా మొదటి స్థానంలో ఉంది అంటూ తెలిపింది. అదే సమయంలో అత్యధిక కరోనా పరీక్షలు నిర్వహించిన దేశాల్లో అమెరికా తర్వాత భారత దేశం టాప్ లో ఉన్నట్లు వైట్ హౌస్ నుండి ఒక ప్రకటన వెలువడింది.
అయితే అమెరికాలో ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో 4.2 కోట్ల మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా... ఇప్పటివరకు భారత్ లో 1.2 కోట్ల పరీక్షలు నిర్వహించారు. ఇలా ప్రపంచంలోనే అత్యధిక కరోనా పరిక్షలు చేసిన దేశాల్లో అమెరికా మొదటి స్థానంలో ఉండగా భారత్ రెండో స్థానంలో ఉంది. తాజాగా కరోనా వైరస్ కు సంబంధించి ఓ ప్రశ్న ఎదురైన నేపథ్యంలో వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరి కైలీ మేక్ నాని ఈ విషయాన్ని వెల్లడించారు.
Powered by Froala Editor
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి