అప్పట్లో సంచలనం సృష్టించిన వైఎస్. రాజశేఖర రెడ్డి సోదరుడు జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు అనేక మలుపులు తిరుగుతూ వస్తోంది. ఎన్నికలకు ముందు ఆయన అనుమానాస్పద రీతిలో మృతి చెందడంపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ వ్యవహారం రాజకీయంగా అనేక సంచలనాలు సృష్టించింది. 2019 మార్చి లో వివేకానంద రెడ్డి హత్యకు గురికాగా, అప్పట్లోనే ఈ వ్యవహారాన్ని నిగ్గు తేల్చాలంటూ, దీనిని సిబిఐ తో విచారణ చేయించాలి అంటూ, అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ డిమాండ్ చేశారు. దీనిపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ తరువాత వైసీపీ అధికారంలోకి వచ్చాక, హైకోర్టులో వేసిన పిటిషన్ ను వెనక్కి తీసుకున్నారు. కాగా దీనిపై వివేక కుమార్తె సునీత హైకోర్టుకు పిటిషన్ దాఖలు చేసి విచారణ చేపట్టాలంటూ ఆదేశాలు ఇచ్చింది. అలాగే ఈ కేసులో కొంతమంది టిడిపి నాయకులు కూడా హైకోర్టును ఆశ్రయించారు.
ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సిట్ బృందం ఈ కేసును విచారిస్తూ ఉండగా, హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసులను విచారించేందుకు సిబిఐ రంగంలోకి దిగింది. ఈ మేరకు కడప ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో ఈ కేసు విచారణ ను సిబిఐ అధికారులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం నియమించిన సిట్ బృందం ఇప్పటి వరకు ఈ వ్యవహారంపై సేకరించిన ఆధారాలు, చేసిన విచారణను సిబిఐ అధికారులు తెలుసుకున్నారు. ఇక ఈ హత్య కేసు ఉదంతంలో తెలుగుదేశం నాయకులు కూడా హైకోర్టును ఆశ్రయించారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సిట్ విచారణ కొనసాగిస్తే, తమను అన్యాయంగా ఇరికించే అవకాశం లేకపోలేదని వారు పిటిషన్ దాఖలు చేశారు. వీటన్నిటిపైన విచారణ చేసిన హైకోర్టు ఎట్టకేలకు ఈ కేసును సిబిఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే సిట్ ఆధ్వర్యంలోని బృందం 13 వందల మంది అనుమానితులను విచారించింది. అయినా హంతకుల జాడ కనిపెట్టి లేకపోవడంపై హైకోర్టు ఆక్షేపించింది. వెంటనే ఈ వ్యవహారాన్ని నిగ్గు తేల్చాల్సిందిగా సీబీఐ ను ఆదేశించడంతో రాజకీయంగాను ఈ వ్యవహారంపై ఆసక్తి నెలకొంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి