వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని నాగపూర్ కి చెందిన వైద్యురాలు సుష్మ... ఇంజనీరింగ్ కళాశాలలో ప్రొఫెసర్ గా పని చేసే భర్త ధీరజ్ తో నివాసముంటుంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే అంతా సాఫీగా సాగిపోతుంది అనుకుంటున్న వేళ... ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. ఇటీవలే భర్త ఇద్దరు పిల్లలు వైద్యురాలు సుష్మా గదిలో ఉన్నారు, పక్కగదిలో ఉన్న అత్త వారిని ఎంత పిలిచినప్పటికీ రాలేదు.. తలుపు తట్టినా తీయలేదు, దీంతో వెంటనే అనుమానం వచ్చిన ఆమె పోలీసులకు సమాచారం అందించింది. హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని ఆ గది తలుపులు బద్దలు కొట్టి చూడగా... అందరూ విగతజీవులుగా పడి ఉన్నారు..
భర్త ధీరజ్ తో పాటు ఇద్దరు పిల్లలు కూడా బెడ్రూమ్ లో మంచం పై విగతజీవులుగా పడి ఉండగా వైద్యురాలు సుష్మ సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకుని విగతజీవిగా వేలాడుతూ కనిపించింది. ఈ ఘటనతో అందరూ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు, ఇక సంఘటనా స్థలంలో రెండు సిరంజీ లతో పాటు ఒక సూసైడ్ నోట్ కూడా లభించింది. తన జీవితం ఆనందంగా లేనందువల్లే అందర్నీ హత్య చేసి తాను ఆత్మహత్య కు పాల్పడినట్లు వైద్యురాలు సుష్మా తెలిపింది, దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి