రోజు రోజుకు రోడ్డు ప్రమాదాల కారణంగా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కరోనా  వైరస్ ఈ సమయంలో రోడ్డు ప్రమాదాలు మరింతగా ఎక్కువ అయ్యాయి. అదేంటి కరోనా  సమయం లో అందరూ ఇంట్లో నే ఉంటే రోడ్డు ప్రమాదాల కు కరోనా కారణం ఎలా అవుతుంది అని అంటారా... కరోనా  సమయం లో  ప్రజలు ఇంటిపట్టునే ఉండడం తో.. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి.. ఈ నేపథ్యంలో ఎంతో మంది అతి వేగంతో ప్రయాణిస్తూ చివరికి రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు.



 ఇక్కడ  ఓ రోడ్డు ప్రమాదం ఏకంగా ముగ్గురు ని బలితీసుకుంది.  ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. వివరాల్లోకి వెళితే.. నెల్లూరు కు చెందిన చల్లపల్లి వెంకటరమణయ్య,  రమణమ్మ హైదరాబాద్ సమీపం లోని కాసారం గ్రామం లో నివాసం ఉంటున్నారు. వీరు ప్రభుత్వం నుంచి వచ్చే పింఛన్  అందుకునేందుకు సమీప బంధువుల తో కలిసి కారులో బయలుదేరారు. ఇక రోడ్డు  నిర్మానుష్యంగా ఉండడంతో అతివేగంతో ప్రయాణించారు. ఈ క్రమంలోనే విధి వక్రించి అతివేగం వారి ప్రాణాలు తీసింది.




 సాయంత్రం సమయంలో దాచేపల్లి మండలం నార్కెట్పల్లి రాష్ట్ర రహదారి వద్దకు రాగానే... అతి వేగం కారణంగా వారు ప్రయాణిస్తున్న కారు డివైడర్ ను  బలంగా ఢీకొట్టింది. దీంతో అమాంతంగా కారు గాల్లోకి ఎగిరి పక్కనే ఉన్న రేకుల షెడ్డు లో పడింది. ఇక ఈ ఘోర ప్రమాదం తో ఒక్కసారిగా స్థానికులు అందరూ షాక్ అయ్యారు. ఈ ప్రమాదంలో వెంకట రమణయ్య తో పాటు రమణమ్మ డ్రైవర్ శ్రీకాంత్ కూడా అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. ఇదే కారులో ప్రయాణిస్తున్న బంధువులు గడ్డం సందీప్, వేణు లు తీవ్రంగా గాయపడ్డారు.వెంటనే  అంబులెన్స్ అక్కడికి చేరుకోగా క్షతగాత్రులను అంబులెన్స్ లో  తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: