తాజాగా విమోచన దినోత్సవం పేరుతో యాత్ర చేపట్టారు. సంజయ్ హిందూ వాదాన్ని బలంగా వినిపిస్తారనే కారణంతో.. ఆయనైతే రాష్ట్రంలో పార్టీని మరింత పటిష్టం చేస్తారని ఢిల్లీ పెద్దలు ఆశించగా..... అయితే కరోనా వల్ల సంజయ్ సామర్థ్యం ఏంటో అంచనా వేయలేని పరిస్థితి ఏర్పడింది. ఈ కరోనా సంక్షోభ టైంలో ఏం చేసినా పెద్దగా ప్రఖ్యాతి పొందే అవకాశం లేదు. ఇప్పుడు బండి సంజయ్ కు ఎన్నికల పరీక్షల సమయం.... అసలైన పరీక్ష త్వరలో సంజయ్ కు ఎదురుకానుంది. వరుస ఎన్నికలను ఆయన ఢీ కొట్ట బోతున్నారు అయితే అవి కూడా ఒకే రకమైన ఎలక్షన్స్ కావు. ఒకటి అసెంబ్లీ మరికొన్ని ఎమ్మెల్సీ.. ఇంకొన్ని మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు. ఇలా ఎన్నో పరీక్షలు సంజయ్ కి సవాల్ గా మారబోతున్నాయి. ఈ ఎన్నికల అనంతరం బిజెపికి ఏ మాత్రం బలం ఉందో.. క్షేత్రస్థాయిలో ఎంతటి పట్టు ఉందో, ప్రజల మనసులో ఎటువంటి ఆదరణ పొందిందో ఎన్నికల ద్వారా స్పష్టం కానుంది.
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి నిర్దేశించారు. అలాగే హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ, వరంగల్-ఖమ్మం- నల్లగొండ శాసనమండలి స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గెలిచేలా తగిన వ్యూహరచనతో తమ అడుగులు ముందుకు సాగాలన్నారు. దుబ్బాక ఉప ఎన్నిక రేసులో ముందు ఉంది...దుబ్బాక ఉపఎన్నిక ముందుగా ఎదురుకానుంది. ఈ పోటీకి సై అంటోంది బిజెపి సైన్యం. తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు బీజేపీయే ప్రత్యామ్నాయం మరియు ప్రజల మెప్పు పొందిన పార్టీ అని చెబుతున్న కమలనాథులు.. ఇక్కడ ఏ స్థాయిలో సత్తా చాటనున్నారో తెలుసుకోవడానికి ఇంకాస్త వెయిట్ చేయాలి మరి.... సంజయ్ ఎన్నికల వ్యూహానికి ఇది తొలిపరీక్ష ... అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల తర్వాత జరిగిన స్థానిక సమరంలో పార్టీ అనుకున్నంత స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది. అప్పటికి సంజయ్ సారథిగా రాలేదు. అయితే ప్రస్తుతం పరిస్థితి మెరుగ్గా ఉంది అనుకుంటున్న సంజయ్.. ఇప్పుడు ఎటువంటి ఫలితం రానుందో అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
జీహెచ్‌ఎంసీ పోరులో సంజయ్ ఎలాంటి వ్యూహాలు రచించబోతున్నారు..??? దుబ్బాక తర్వాత గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. గ్రేటర్ ఎన్నికలు బీజేపీకి సెమీఫైనల్ వంటివి .... మరి.. బండి సంజయ్ కెప్టెన్సీలో టీమ్ విజయకేతనం ఎగురవేసి ఉందా లేదా అన్న విషయం ఫలితాలపై ఆధారపడి ఉంటుంది.150 డివిజన్లు ఉన్న జీహెచ్‌ఎంసీ లో బీజేపీకి కనీసం ఐదుగురు కూడా కార్పొరేటర్లు లేకపోవడం విశేషం. పైగా పార్టీ ముఖ్యనేతలంతా హైదరాబాద్‌లోనే ఉంటారు. ఇటు ఇంకోపక్క గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు కూడా సిద్ధం కావాల్సి ఉంది. తమ పార్టీని టిఆర్ఎస్ కు దీటుగా నిలపాలంటే ఈ ఎన్నికల్లో గెలిచి నిలదొక్కుకోవాల్సి ఉంటుంది.
మార్చిలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు! ఇలా ఎన్నో పరీక్షలతో బీజేపీ కొత్త సారథి ఎలా ఈ సవాళ్లను ఎదుర్కొని అధిగమించగలరు అన్న విషయం ఆసక్తిగా మారింది. అంతేకాదు ఈ ఎన్నికల అనంతరం బండి సంజయ్ కు అసలైన గుర్తింపు లభించనుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి