అంతర్వేది సంఘటన కాస్త సద్దుమణుగుతుంది అనుకుంటున్న సమయంలో ఆకస్మాత్తుగా విజయవాడ దుర్గమ్మ ఆలయానికి చెందిన వెండి రథానికి చెందిన వెండి సింహాలు పోవడంతో, ఈ విషయం పెద్ద దుమారాన్ని రేపుతోంది. ఈ వ్యవహారం ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పూర్తిగా ఇరుక్కుపోయారు. ఆయన గట్టిగా ప్రతిపక్షాలకు సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. ఇదే అదునుగా బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, హడావుడి చేస్తున్నారు. బిజెపి ఏ విధంగా అయినా జగన్ ప్రతిష్టతను తగ్గించాలని ప్రయత్నిస్తోంది. ఈ విషయంపై జనంలోనూ పెద్ద చర్చే నడుస్తోంది.
కొద్దిరోజులుగా ఈ వ్యవహారాలు జగన్ కు పెద్ద తలనొప్పి కలిగిస్తున్నాయి. దీంతో పార్టీ శ్రేణుల నుంచి జగన్ పై తీవ్ర స్థాయిలో ఒత్తిడి పెరుగుతోంది. వెంటనే మీడియా సమావేశాన్ని నిర్వహించి వాస్తవం ఏమిటో ప్రజలకు వివరించి ప్రతిపక్షాల నోరు మూయించాలి అంటూ ఒత్తిడి పెరుగుతుండడంతో, జగన్ కూడా రేపో మాపో మీడియా సమావేశం నిర్వహించాలనే అభిప్రాయంతో ఉన్నట్లు తెలుస్తోంది. మీడియా ద్వారానే అన్ని విషయాలపైనా క్లారిటీ ఇవ్వాలని జగన్ చూస్తున్నట్టుగా తెలుస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి