దేశానికి అన్నం పెట్టే రైతన్న కు మాత్రం మంచి రోజులు రావడం లేదు. ప్రతిసారి ఎన్నో ప్రతిసారి ఎన్నో ఆశలతో ఉన్న రైతుల కు నిరాశే ఎదురవుతుంది. రోజు రోజుకు ప్రకృతి ఒడిలో వ్యవసాయం చేసుకుంటూ బ్రతికే రైతన్న పై ప్రకృతి పగ బట్టి ప్రతిసారి అప్పుల ఊబిలో కి నెడుతూ నే  ఉంది. దీంతో రైతుల జీవితం దిక్కు తోచని స్థితిలో పడిపోతూ నే ఉంది. ఇక గత కొన్ని రోజుల నుంచి రాష్ట్రం లో భారీగా కురుస్తున్న వర్షాల తో రైతుల జీవితం మరోసారి అయోమయం లో పడిపోయింది. రైతన్న ఆశలన్నీ అడియాశలుగానే  మిగిలిపోయాయి.




 గత రెండు మూడు సంవత్సరాల నుంచి వర్షాలు లేక కనీసం పంటకు నీరు అందక.. వేసిన పంటలు మొత్తం ఎండిపోయి ఏమీ చేయలేని దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు రైతన్న. కనీసం పంట కోసం వేసిన పెట్టుబడి కూడా రాకపోవడంతో అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. ఈ ఏడాది వర్షాకాలంలో  కురిసిన వర్షాలతో  మాత్రం రైతన్న ఆనందభాష్పాలు వచ్చాయి. దీంతో రైతులు అందరూ ఎంతో ఉత్సాహంగా పంటలు వేశారు. వరుసగా కురిసిన వర్షాలతో పంటలు కూడా బాగాపండాయి . దీంతో రైతన్న తమ కష్టాలు తీరిపోయాయి అనుకున్నాడు.



 కానీ వర్షాకాలం పూర్తయినప్పటికీ కూడా కురుస్తున్న భారీ వర్షాలతో రైతన్నకు కన్నీటి గాథలు మిగిలిపోతున్నాయి. నాడు వర్షాలు కురిసినందుకు ఆనందభాష్పాలతో మురిసిపోయిన రైతన్న నేడు భారీగా కురుస్తున్న వర్షాలతో పంటలు నీటమునిగి కన్నీటి గాధ లో మునిగిపోయాడు. దీంతో ఎన్నో ఎకరాల్లో పంట నీట మునిగి ధ్వంసం కావడంతో చేతికొచ్చిన కొడుకు లాంటి పంట ధ్వంసం కావడంతో ఏం చేయాలో తెలియని దిక్కుతోచని స్థితిలో పడిపోయి ఎవరైనా ఆదుకుంటారా  అని దీనంగా చూస్తున్నాడు  రైతన్న. మరి ప్రభుత్వాలు నీట మునిగి పంట నష్టపోయిన రైతులందరికీ ఎలా ఆదుకుంటాయో  చూడాలి మరి. 

మరింత సమాచారం తెలుసుకోండి: