ప్రజల్లో అమోఘమైన ప్రతిష్టను పోగుచేసుకుంటున్న ప్రభుత్వంపై బురదజల్లడం ద్వారా తక్కువ సమయంలోనే తమను తాము నిరూపించుకోవచ్చనే ప్రయత్నాలు అన్ని ప్రతిపక్ష పార్టీ ల్లో కనిపిస్తుంది.. బీజేపీ ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న కూడా జగన్ పై విమర్శలు చేస్తూ నానా రచ్చ చేస్తుంది.. టీడీపీ అయితే జగన్ ని అసలు విడిచిపెట్టకుండా విమర్శిస్తోంది.. తొమ్మిదేళ్ళ పాటు అన్నిరకాల ఎదురు దెబ్బలకు ఎదురొడ్డి, మూడున్నర వేల కిలోమీటర్లకుపైగా పాదయాత్ర ద్వారా ప్రజల మనస్సుల్లో చెరగని ముద్రవేసుకున్నాడు ఏపీ సీయం వైఎస్ జగన్ ని అన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతూ వైసీపీ ఆగ్రహానికి గురవుతున్నారు..
ప్రతిపక్షాలు ఎంత చేస్తున్నా జగన్ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలోకి తీసుకెళుతూనే ఉన్నాడు..మొదటి ఏడాది సంక్షేమ పథకాల ఫై ఫోకస్ పెట్టిన జగన్ రెండో ఏడాది అభివృద్ధి పనులపై ఫోకస్ పెట్టారు. నిర్ణయం తీసుకున్నదే తడవుగా వెంటనే వాటిని ఆచరణలో పెడుతున్నారు. 972 కిలోమీటర్ల తీరప్రాంతం ఉన్న ఏపీలో పోర్టులు, రేవుల అభివృద్ధికి పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నో ఏళ్ల తరబడి ప్రతిపాదనల దశలోనే ఉన్న పోర్టులు, రేవుల నిర్మాణాన్ని సీఎం వైఎస్ జగన్.. ఆచరణలో పెడుతున్నారు. ఇటీవల మంత్రివర్గం ఆమోదం తెలపడంతో.. ప్రకాశం జిల్లా రామాయపట్నం, శ్రీకాకుళం జిల్లా భావనపాడు పోర్టులతోపాటు నాలుగు చేపల రేవుల నిర్మాణానికి టెండరు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వాటిని జుడీషియల్ రివ్యూకు పంపారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి