పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోల గురించి వారి గొప్పతనం గురించి మాట్లాడం ఇప్పుడు చర్చనీయాంశం అయింది. ఆయన చెప్పిన వివరాల ప్రకారం, సినిమా వారంటే పైనుండి ఊడిపడలేదు, మేమూ మామూలు మనుషులమే. మాకూ కష్టాలు మరియు బాధలు ఉంటాయి. మమ్మల్ని ఏదో పెద్ద కోటీశ్వరుల్లా చూడడం ఆపండి అని ప్రజలకు మొదటిగా తెలియచేసారు. ఇదంతా కూడా ఇటీవల తీవ్ర వర్షాలు మరియు వరదలతో నష్టపోయిన తెలంగాణ రాష్ట్రము గురించి మాట్లాడుతూ, కొంతమంది సినిమావాళ్లు విరాళాలు ఇవ్వడంలేదని కొంతమంది విమర్శించారు , వారిని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ మాట్లాడినట్టు తెలిసింది.

అయితే సినిమా వాళ్ళ గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడినమాటలు కొంతవరకు వాస్తవముగానే అనిపించాయి. కాగా సినిమా రంగ పరంగా పవన్ కళ్యాణ్ ఎలా ఉన్నా కానీ, రాజకీయాల్లోకి వచ్చి జనసేన పార్టీ పెట్టిన తరువాత గడిచిన ఎన్నికలలో ఆశించిన సీట్లు రాకపోగా, పెద్ద క్రియాశీలక పార్టీగా కూడా లేదని చెప్పొచ్చు. అంతేకాకుండా ఈ మధ్య జనసేన పార్టీ బీజేపీతో కలవడం వలన మరిన్ని విమర్శలు ఎక్కువయ్యాయి.  అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాజకీయనాయకులను విమర్శిస్తూ చేసిన ఘాటు వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. వీరు ఎంతసేపు సినిమావాళ్లు విరాళాలు ఇవ్వలేదు...వాళ్ళు కోట్లు కోట్లు సంపాదిస్తున్నారు అంటారు కానీ...వాస్తవంగా చూస్తే రాజకీయనాయకులు ఎప్పుడైనా విరాళాలు ఇచ్చారా....ప్రతిసారి జరిగే ఎన్నికలలో ఎంతెంత ఖర్చు పెడతారు...

మరి ఇలాంటి విపత్కర సమయాలలో ప్రజలు మీకు కనిపించరా అంటూ వారిపై ధ్వజమెత్తారు. అసలు మాకన్నా...రాజకీయనాయకులకు మరియు రియల్ ఎస్టేట్ ఫీల్డ్ లో ఉండేవాళ్ళకి ఎక్కువమొత్తంలో టర్న్ ఓవర్ ఉంటుంది...సినిమా వారికి అంత ఉండదు.. అయినా సరే మా తిప్పలు మేము పడుతూ విరాళాలు ఇస్తూనే ఉన్నాము కదా...ఇప్పుడు కూడా చాలా మంది ఇవ్వడం మీకు తెలిసిందే. ఈ తెలంగాణ వరదలకు పవన్ కళ్యాణ్ కోటి రూపాయలు విరాళం ఇచ్చారు. కాబట్టి ఇటువంటి విమర్శలు చేయటం సమంజసం కాదని ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: