సాగు భూముల రిజిస్ట్రేషన్ సులభతరం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం ‘ధరణి’ పోర్టర్ ను రైతుల ముంగిట్లోకి తీసుకొచ్చింది. మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి తహసీల్దార్ కార్యాలయంలో గురువారం సీఎం కేసీఆర్ ముఖ్యఅతిథిగా హాజరై పోర్టల్ ను ప్రారంభించారు. ఈ సేవలు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 570 (హైదరాబాద్ మినహా) మండలాల్లో నేటి నుంచి అమలులోకి రానున్నాయి. ఇప్పటివరకూ రాష్ట్రవ్యాప్తంగా జారీ చేసిన 59.46 లక్షల ఖాతాలు, 1.48 కోట్ల ఎకరాల విస్తీర్ణానికి సంబంధించిన వివరాలు ధరణిలో రిజిస్టర్ చేయనున్నారు.

ధరణిలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ నవంబర్ 2వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఈ పోర్టల్ సాయంతో ల్యాండ్ కి సంబంధించి రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు జరుగుతాయని ఆయన తెలిపారు. చింతలపల్లి తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మొదట పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తదనంతరం ధరణి పోర్టల్ ను ఆవిష్కరించారు. ధరణికి సంబంధించిన ఉపయోగాలపై స్థానికులకు అవగాహన కల్పించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: