గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలని ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ శుక్రవారం మలక్‌పేట, యాకుత్‌పుర నియోజకవర్గాలలోని మూసారంబాగ్, సైదాబాద్, అక్బర్‌బాగ్, సైదాబాద్, ఐఎస్‌సదన్, కుర్మగూడ డివిజన్లలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్బంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. సంక్షేమ పథకాల కోసం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను సీఎం కేసీఆర్ మింగేస్తున్నాడని ఆరోపించారు. పోలీసు ఉన్నతాధికారులు టీఆర్‌ఎస్ పార్టీకి అనుకూలంగా పని చేస్తున్నారని, ప్రజల కోసం పని చేయాల్సిన అధికారులు పార్టీల కోసం ఎలా పని చేస్తున్నారని ప్రశ్నించారు. ఓటింగ్ జరగకుండా టీఆర్‌ఎస్ పార్టీ ఎత్తులు వేస్తుందన్నారు.
టీఆర్‌ఎస్ పార్టీ ఇచ్చిన పైసలు తీసుకోని హిందూ ధర్మం కోసం పాటు పడుతున్న బీజేపీని గెలించాలని ప్రజలను కోరుతున్నట్లు పేర్కొన్నారు. హిందువులకు చాలా పండుగలు ఉంటాయని, మీకు మాత్రం ఒక్కటే పండుగ అని ఓవైసీని ఎద్దేవా చేశారు. సర్దార్ పటేల్, శివాజీలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. బీజేపీ ఓడితే హిందువులు తలదించుకోవాల్సి పరిస్థితి ఏర్పడుతుందన్నారు.
మూసారాంబాగ్ అభ్యర్థి బొక్క భాగ్యలక్ష్మి, కుర్మగూడ డివిజన్ బీజేపీ అభ్యర్థి పుప్పాల శాంత, అక్బర్‌బాగ్ అభ్యర్ధి నవీన్‌రెడ్డి, సైదాబాద్ అభ్యర్థి అరుణ, ఐఎస్‌సదన్ అభ్యర్థి జంగం శ్వేతను ఆయా డివిజన్ల ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించి టీఆర్ఎస్ తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో భాగ్యనగర్ జిల్లా అధ్యక్షుడు సంరెడ్డి సురేందర్‌రెడ్డి, జాతీయ కౌన్సిల్ సభ్యుడు సహదేవ్‌యాదవ్, మాజీ ఎమ్మెల్యే రామకృష్ణరెడ్డి, విజయ్‌కాంత్, రమేష్‌రెడ్డి, తదితరులున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి