గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బిజెపిని ఎదుర్కొని ప్రచారం చేసే విషయంలో టిఆర్ఎస్ పార్టీ ఘోరంగా వెనకబడి ఉంది అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి. టిఆర్ఎస్ పార్టీ ప్రచారం చేసిన నాలుగు రోజులు కూడా సమర్థవంతంగా చేయలేక పోయింది అనే భావన చాలా మందిలో ఉంది. ప్రచారం మొత్తం కూడా మంత్రి కేటీఆర్ మీదనే పడింది అనే వ్యాఖ్యలు ఎక్కువగా రాజకీయ వర్గాల్లో  వినపడుతున్నాయి. మంత్రి కేటీఆర్ మినహా ఎవరూ కూడా ప్రచారంలో ఆశించిన స్థాయిలో చేయలేకపోయారు.

ఇది బ్బంది పెడుతుంది అనే అభిప్రాయం రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ నుంచి కేంద్ర మంత్రులు వచ్చినా సరే టిఆర్ఎస్ పార్టీ నుంచి రాష్ట్ర స్థాయిలో ఉన్న మంత్రులు కూడా సమర్థవంతంగా ప్రచారం నిర్వహించలేకపోయారు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. దీంతో భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో కచ్చితంగా ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఆశించిన స్థాయిలో ప్రజాదరణ ఉన్న నేతలు కూడా ప్రచారం చేయలేకపోయారు. సీఎం కేసీఆర్ కూడా ప్రచారం విషయంలో ఘోరంగా వెనుకబడి ఉన్నారు.

ఆయన ఒక బహిరంగ సభ ఒక మీడియా సమావేశం మినహా పెద్దగా ఏమీ కూడా నిర్వహించిన పరిస్థితి లేదు. దీని వలన టీఆర్ఎస్ పార్టీ విజయావకాశాలు దెబ్బ పడే పడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి మంత్రులు అదేవిధంగా బీజేపీ అగ్రనేతలు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చి ప్రచారం చేసిన సీఎం కేసీఆర్ మాత్రం ఆశించిన స్థాయిలో ప్రచారం చేయలేకపోయారు. మంత్రి కేటీఆర్ కోసం అభ్యర్థులు ఎదురు చూడటం కూడా చాలావరకు టిఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టింది అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. టిఆర్ఎస్ పార్టీ విజయావకాశాలు మీద ఈ అంశం కచ్చితంగా దెబ్బ కొట్టే అవకాశాలు ఉన్నాయని చాలా మంది రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: