సమయానుకూలంగా ప్రోగ్రాములు మార్చడం రాజకీయ నాయకులకు వెన్నతో పెట్టిన విద్య. ఎక్కడ ఏ వ్యవహారం చేసినా రాజకీయంగా అది కలిసి వచ్చేదే అయి ఉంటుంది. పొత్తులు ఎత్తులు రాజకీయంగా తమకు కలిసి వచ్చే విధంగా  నాయకులు చూసుకుంటూ ఉంటారు. తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ విషయానికి వస్తే, గతంతో పోలిస్తే రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది టిఆర్ఎస్ పార్టీ జెండా దుబ్బాకలో ఎగురుతుంది అనుకోగా, అక్కడ ఫలితం తేడా కొట్టింది.అలాగే గ్రేటర్ ఎన్నికల లో వందకు పైగా స్థానాల్లో టీఆర్ఎస్ పాగా వేస్తుందని భావించినా, అక్కడ అ ఆ ఫలితాలను అందుకోలేకపోయింది. ఈ బాధ్యతలు నిర్వర్తించిన కేటీఆర్ పైన విమర్శలు వ్యక్తమయ్యాయి. 




ఇదిలా ఉంటే బిజెపి ప్రస్తుతం దూకుడుగా ఉన్న సమయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లడం, కేంద్ర బిజెపి పెద్దలను కలుస్తూ, అనేక ప్రజా సమస్యలను ప్రస్తావించడమే కాకుండా, రహస్య సమావేశాలు కూడా బీజేపీ నేతలతో పెట్టుకోవడం వంటి వ్యవహారాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. సాధారణంగా రెండోసారి అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం పై ఎంతో కొంత వ్యతిరేకత ఉంటుంది . ఇప్పుడు  ఎదుర్కొంటోంది. అయితే బిజెపి దూకుడు పెరుగుతున్న నేపథ్యంలో, ఆ వివాదం పెట్టుకోవడం అనవసరం అనే అభిప్రాయానికి కెసిఆర్ వచ్చినట్టుగా కనిపిస్తున్నారు. అందుకే కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణం విషయమై, ప్రధాని మోదీని కేసీఆర్  అభినందించడం, ఢిల్లీకి వెళ్లి కేంద్ర బిజెపి పెద్దలను, ప్రధాని నరేంద్ర మోడీని కలవడం వెనుక కెసిఆర్ రాజి ఫార్ములాను ఉపయోగిస్తున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి.




ముఖ్యంగా కేటీఆర్ కు తెలంగాణ సీఎం బాధ్యతలు అప్పగించే ఆలోచనతో ఉన్న కేసీఆర్, ఈ సమయంలో బీజేపీతో వివాదాల్లోకి వెళ్లడం రాజకీయంగా ఇబ్బందులు తెచ్చిపడతాయి అనే విషయం గుర్తించినట్లుగా కనిపిస్తున్నారు. పైకి తెలంగాణ సమస్యలు అని చెబుతూ, బిజెపి అగ్ర నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో కెసిఆర్ ఉన్నట్టు  తెలంగాణ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: