ఇక బీజేపీ సైతం వైసీపీ ప్రభుత్వాన్నే తప్పుబడుతుంది. ఇలా పార్టీల మధ్య టెంపుల్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. అలా అని దేవాలయాలపై దాడులు మాత్రం ఆగడం లేదు. వరుసగా ఆలయాలపై గుర్తు తెలియని దుండగులు దాడి చేస్తూనే ఉన్నారు. తాజాగా రామతీర్ధంలో రాముడి విగ్రహం, రాజమండ్రిలో సుబ్రహ్మణ్యేశ్వరస్వామి విగ్రహాన్ని ధ్వంసం చేసినా, వాటికి సంబంధించిన నిందితులని పోలీసులు పట్టుకోలేదు. కానీ విజయసాయిరెడ్డి మాత్రం చంద్రబాబు, టీడీపీ నేతలు చేశారని మాట్లాడుతున్నారు.
అలా విమర్శలు చేసినప్పుడు టీడీపీ వారినైనా విచారించాలి కదా...అలాంటి కార్యక్రమం కూడా జరగడం లేదు. మళ్ళీ దీనికి తోడు తాజాగా చంద్రబాబు, విజయసాయిరెడ్డిలు రామతీర్ధం పర్యటనలు చేశారు. చంద్రబాబుకు ముందే రామతీర్ధం వెళ్లడానికి పర్మిషన్ ఇచ్చారు. అందులో భాగంగా బాబు రామతీర్ధం వచ్చారు. కానీ చంద్రబాబునే అనుమతించి పలువురు టీడీపీ నేతలనీ ఆపేశారు.
అయితే విజయసాయి సడన్‌గా రామతీర్ధం పర్యటనకు వచ్చేశారు. బాబు వచ్చిన రోజే విజయసాయికి పర్మిషన్ వచ్చేసింది. ఇక వీరి పర్యటనలతో రామతీర్ధం రణక్షేత్రంగా తయారైంది. ఈక ఇక్కడ ఇంకో విమర్శ కూడా వస్తుంది. బీజేపీ ఆడుతున్న దేవుడి ఆటలో వైసీపీ, టీడీపీ పావులుగా మారుతున్నాయని, దేవాలయాలపై బీజేపీనే దాడులు చేయించి కావాలనే నాటకం ఆడుతుందనే అనుమానం కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు. కాకపోతే ప్రజా సమస్యలపై పోరాటం చేసిన పార్టీలు, దేవాలయాలపై రాజకీయం చేస్తున్నాయి. ఈక ఇది బీజేపీ అదే మైండ్ గేమ్ అని పలువురు భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ బీజేపీ మీద అనుమానం వ్యక్తం చేస్తోంది. మొత్తానికైతే ఏపీలో ఈ ఆలయాల రగడ ఎప్పటికి ఆగుతుందో?
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి