ప్రస్తుతం పార్టీ సమావేశాలన్నీ జూమ్ ద్వారానే కాన్ఫరెన్సు లో బాబు నిర్వహిస్తున్నారు. అక్కడ కూడా చెప్పాల్సింది సూటిగా సుత్తి లేకుండా చెప్పకుండా, గత టిడిపి ప్రభుత్వంలో ఏ విధంగా అయితే బాబు వ్యవహరించారో, ఇప్పుడు అదే స్థాయిలో వ్యవహరిస్తూ, గంటలకొద్ది ఉపన్యాసాలు ఇస్తూ ఉండడం తెలుగు తమ్ముళ్లకు చిరాకు తెప్పిస్తోందట. మైకు పట్టుకుంటే వదలకుండా చెప్పిందే చెబుతూ, గతంలో తాను చేసిన గొప్పలు, ఇప్పుడు పార్టీ శ్రేణులకు ప్రస్తావిస్తూ, ఎవరు ఏం చెప్పినా అంతా తనకు తెలుసునని, నేను చెప్పేది మాత్రమే వినాలి అంటూ హడావుడి చేస్తుండటం కూడా తమ్ముళ్లకు ఆగ్రహం, ఆవేదన కలిగిస్తున్నాయి.
ఇదే విషయంలో ఏపీ సీఎం జగన్ నే తీసుకుంటే అధికారికి సమావేశాలు, పార్టీ సమావేశాలు ఏదైనా సూటిగా, సుత్తి లేకుండా సింపుల్ గా చెప్పేస్తూ, తన కాన్సెప్ట్ ఏంటో అర్థమైతే చాలు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. బాబు మాత్రం గంటలకొద్ది ఉపన్యాసాలిస్తూ పార్టీ నేతల సహనాన్ని పరీక్షిస్తూ ఉండడంతో బాబు ఉపన్యాసాలు, సూక్తులు వినలేక తమ్ముళ్లు బాబు కాన్ఫరెన్స్ అంటే బెంబేలెత్తే పరిస్థితి వచ్చిందట. దీంతో బాబు పార్టీ నేతలను యాక్టివ్ చేద్దామని తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నా, అది కాస్త బెడిసి కొడుతున్నట్టుగా కనిపిస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి