టిడిపి అధినేత చంద్రబాబు లో కోపం, అసూయ ద్వేషాలు రోజురోజుకు పెరిగిపోతున్నట్లు కనిపిస్తున్నాయి. తరచుగా ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ, మరింత వివాదాస్పదం అవుతున్నారు. ఏపీ సీఎం జగన్ ను ఉద్దేశించి ఆయన సంచలన వ్యాఖ్యలు చేస్తూ,  మంత్రి కొడాలి నాని వంటి వారితో తిరిగి తిట్టించుకుంటూ వస్తున్నారు . కొద్దిరోజులుగా ఏపీలో ఆలయాలలో విగ్రహాలపై దాడులు జరుగుతుండడం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా విజయనగరం జిల్లాలోని రామతీర్థం లో శ్రీరాముడు విగ్రహం ధ్వంసం చేయడం రాజకీయ రచ్చ జరుగుతూనే ఉంది. ఈ వ్యవహారాలపై చంద్రబాబు తాజాగా స్పందించారు. 





ఆలయాలపై దాడులు, పోలీసుల తీరు, ప్రభుత్వం నిర్లక్ష్యం వంటి వ్యవహారాలను ప్రస్తావిస్తూ విమర్శలు చేశారు. మత మార్పిడులు చేయించే అధికారం సీఎంకు ఎవరు ఇచ్చారు అంటూ నిలదీశారు. హిందూ ముస్లిం మనోభావాలు దెబ్బతీస్తున్నారని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రామతీర్థం పర్యటన చేపట్టడంతో ప్రభుత్వం భయపడి తమపై నిందలు వేస్తోందని , ఘటన జరిగి ఐదు రోజులు అయినా పట్టించుకోకుండా సీఎం ఏం గడ్డి పీకాడని చంద్రబాబు విమర్శలు చేశారు. హిందూ దేవాలయాల పై జరుగుతున్న దాడులను ఇక ఏమాత్రం ఉపయోగించేది లేదన్నారు.





 సీఎం హోమ్ మంత్రి, డీజీపీ క్రిస్టియన్లు అయినంత మాత్రాన, కేవలం తమపై జరుగుతున్న దాడులను ఆపరా అంటూ చంద్రబాబు మండిపడ్డారు.తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏ మసీదు చర్చి పైన దాడి జరగలేదని బాబు అన్నారు. రామతీర్థం పర్యటనకు ముందుగా అనుమతి ఇచ్చినట్టే ఇచ్చిన పోలీసులు తమకు అడుగడుగున అడ్డుతగిలారు అంటూ మండిపడ్డారు. రాష్ట్రం లో మత మార్పిడి చేయడానికి వీలు లేదని,  కులమతాలకు అతీతంగా ఉంటానని చేసిన ప్రమాణం జగన్ గుర్తించాలని సూచించారు. బాబు వ్యాఖ్యలపై మరోసారి రాజకీయ దుమారం చెలరేగే అవకాశం కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: