సొంత కొడుకును లైంగికంగా వేధించిన కేసులో ఓ తల్లికి కేరళ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. వివరాల్లోకి వెళితే.. భార్య భర్తలు మూడేళ్లుగా విడిగా ఉన్నారు. వాళ్లకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే భార్య భర్తల మధ్య గొడవల కారణంగా విడిపోయారు. అతను ముగ్గురు పిల్లలను బలవంతంగా తన వెంట విదేశాలకు తీసుకెళ్లారు.అనంతరం కుమారుడిపై తన భార్య లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా భర్త ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఒక మానసిక వైద్యుడు ఇచ్చిన రిపోర్టును కేరళ శిశు సంక్షేమ కమిషన్‌కు పంపాడని తెలిపారు. దీని ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి ఆమెను అరెస్ట్‌ చేశారని ఆరోపించారు.



ఈ కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే కుమారుడి మానసిక పరిస్థితిని నిఫుణుల కమిటీతో పరిశీలించాలని సూచించింది. కొల్లం జిల్లాకు చెందిన 36 ఏండ్ల మహిళ తన కుమారుడికి మత్తుపదార్థాలు ఇచ్చి లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆమె భర్త ఆరోపించాడు. ఈ మేరకు అరెస్ట్ చేసిన పోలీసులు రెండు వారాల పాటు రిమాండ్ కు తరలించారు.పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. కాగా రాష్ట్రంలో ఇలాంటిది తొలి కేసు కావడంతో కేరళలో కలకలం రేపింది. అనేక చర్చలకు దారి తీసింది.



ఈ విషయం పై తాజాగా ఆమె రెండో కొడుకు మీడియాతో మాట్లాడాడు..తన తల్లి పై తండ్రి తీవ్ర ఆరోపణలు చేశాడని వెల్లడించారు. తల్లికి విడాకులు ఇవ్వకుండా మరొక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని చెప్పాడు.తల్లి కుటుంబ సభ్యులు కూడా పోలీసుల తీరుపై మండిపడ్డారు. ఎలాంటి దర్యాప్తు చేయకుండానే ఆమెను అరెస్ట్‌ చేసినట్లు ఆరోపించారు. మరో వివాహం చేసుకున్న భర్తకు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయిస్తానని చెప్పడంతో ఆమెపై వేధింపులకు పాల్పడుతున్నాడని చెప్పారు.. తల్లి కుటుంబ సభ్యుల వివరాల మేరకు అతని పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: