అధికార పార్టీకి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కి మధ్య పంచాయతీ ఎన్నికల పోరు ఎలా ఉన్నా... ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసింది ఎస్ఈసి. సుప్రీంకోర్టులో కూడా తమకు అనుకూలమైన తీర్పు వస్తుంది అన్న భావనతో ఎస్ఈసి ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే నిమ్మగడ్డ రమేష్ మాత్రం ఎన్నికలకు హైకోర్టు క్లారిటీ ఇచ్చింది కానీ, ఒకవేళ సుప్రీంకోర్టులో ఎన్నికలు వాయిదా వేయాలని నిర్ణయిస్తే అందుకు అనుగుణంగా నడుచుకుంటారు కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలకు మరింత ఆలస్యం కాకుండా ఉండేందుకే ఇలా ముందడుగు వేయాల్సి వచ్చింది అంటూ చెబుతున్నారు.

 పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది ఎస్ఈసి. కాగా ఈ సందర్భంగా మాట్లాడిన నిమ్మగడ్డ రమేష్ ఏమన్నారంటే....??? 2021 ఎన్నికల రూల్ అనుసరించి ఎలక్షన్ జరపాలి అనుకున్నాం. కానీ ఓటర్ల జాబితా రెడీ చేయడంలో పంచాయతీరాజ్ శాఖ పూర్తిగా విఫలమైంది.  అందుకే 2019 ఓటర్ల జాబితా ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలనుకుంటున్నామని తెలిపారు. తొలి విడత ఎన్నికల కొరకు జనవరి 25 నుంచి నామినేషన్లు పరిగణనలోకి తీసుకుంటాం. జనవరి 27న నామినేషన్ల దాఖలుకు గడువు ముగియనుంది . జనవరి 28న నామినేషన్ల పరిశీలన జరగనుంది. జనవరి 30న అభ్యంతరాలపై తుది నిర్ణయం తీసుకుంటాం. జనవరి 31 నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువుగా నిర్ణయించడం జరిగింది.

అంతేకాకుండా పంచాయతీరాజ్ శాఖ వైఖరిపై మండిపడ్డారు. పంచాయతీరాజ్ బాధ్యతారాహిత్య వైఖరి కారణంగా దాదాపు 3.6 లక్షల మంది కొత్త ఓటర్లు తమ ఓటు హక్కు కోల్పోయారు అని వాపోయారు. ప్రతి పౌరుడికి తమ ఓటును వినియోగించుకునే హక్కు ఉందని. ఎవరైతే ఓటును కోల్పోయారో వారందరికీ తిరిగి ఓటు హక్కును కల్పించడానికి ప్రయత్నిస్తామని... ఇందుకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇక ఇవన్నీ కూడా ముందస్తు ప్రణాళికగా సిద్ధం చేసుకున్నాము. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బట్టి ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు ఎస్ఈసి నిమ్మగడ్డ రమేష్...!

మరింత సమాచారం తెలుసుకోండి: