కరోనాపై చేస్తున్న పోరాటం కారణంగా ఇప్పుడు ఇండియావైపు ప్రపంచం మొత్తం చూస్తోంది. కరోనా మహమ్మారి పీచమణిచే వ్యాక్సీన్‌ రూపొందించం ద్వారా ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోంది. అంతే కాదు.. తన పొరుగుదేశాలకు కూడా ఇండియా కరోనా వ్యాక్సీన్‌ ఉచితంగా అందిస్తూ.. మిత్ర దేశాల అభిమానం చూరగొంటోంది. మన శాస్త్రవేత్తల కృషి పుణ్యమా అని ఇప్పుడు ప్రపంచంలో ఇండియా గర్వంగా తలెత్తుకుంటోంది.

దాదాపు 150కి పైగా దేశాలు మాకూ టీకా సరఫరా చేయరా ప్లీజ్‌ అంటూ ఇండియాను కోరుతున్నాయంటే.. అది ఎంత గర్వకారణం. ఈ కృషిని గుర్తించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ.. ఇండియాను తెగ పొగుడుతోంది. కరోనా మహమ్మారిపై పోరాటంలో ప్రపంచ దేశాలకు సాయపడుతున్నందుకు, ప్రధాని నరేంద్ర మోదీకి ప్రపంచ ఆరోగ్య సంస్థ  డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అథనోమ్‌ ధన్యవాదాలు తెలిపారు. కొవిడ్‌పై పోరులో సమాచారం పంచుకోవడం సహా కలిసికట్టుగా పోరాటం చేయడం ద్వారా మాత్రమే మహమ్మారి వ్యాప్తిని అడ్డుకోవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్  అభిప్రాయపడ్డారు.

శ్రీలంక సహా మరో 7 దేశాలకు... సహాయం కింద వ్యాక్సిన్‌ పంపాలని భారత్‌ ఇటీవల నిర్ణయించింది. దీనిలో భాగంగా ఇప్పటికే.. నేపాల్‌, బంగ్లాదేశ్‌, భూటాన్‌, మాల్దీవులకు కొవిడ్‌ టీకా డోసులను పంపించింది. ఈ మేరకు ప్రకటన  చేసిన టెడ్రస్‌ అథనోమ్‌ పరస్పర సహకారంతో కరోనా మరణాలను ఆపవచ్చని వ్యాఖ్యానించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రత్యేక ప్రశంసలతో ఇండియా గ్రాఫ్‌ అంతర్జాతీయంగా మరో మెట్టు ఎక్కినట్టయింది.

మరోవైపు.. టీకాల పంపిణీలోనూ ఇండియా రికార్డు అదిరిపోతోంది. కేవలం వారం రోజుల వ్యవధిలోనే దేశవ్యాప్తంగా దాదాపు 14 లక్షల మందికి కోవిడ్ 19 టీకాలు వేసింది ఇండియా. ఇప్పటి వరకు 22 వేల సెషన్స్ లో టీకాల పంపిణీ పూర్తయిందని కేంద్రం ప్రకటించింది. శుక్రవారం  27 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ కొనసాగింది. మరి ఇండియానా మజాకా.. మేరా భారత్ మహాన్‌.. జై బోలో భారత్‌..

మరింత సమాచారం తెలుసుకోండి: