చైనాకు భారత్ గట్టి షాకులే ఇస్తోంది....!!!

ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..

విదేశాలకు టీకా సరఫరా ద్వారా కరోనా నెపం తనపై పడకుండా తప్పించుకోవాలనుకుంటున్న చైనాకు భారత్ గట్టి షాకులే ఇస్తోంది. కరోనాతో అల్లాడుతున్న దేశాలకు వేగంగా ఆపన్న హస్తం అందిస్తూ చైనాపై పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తోంది. తాజాగా.. చైనా మిత్రదేశమైన కంబోడియాకు కరోనా టీకా పంపించేందుకు భారత్ నిర్ణయించింది. 

త్వరలో మంగోలియాకు, పసిఫిక్ సముద్రంలోని ఇతర ద్వీప సముదాయాలకు టీకా సరఫరా చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ప్రపంచలోనే అతిపెద్ద టీకా తయారీ దారుగా భారత్‌కు ఉన్న సామర్థ్యాన్ని పొరుగు దేశాలతో దౌత్యసంబంధాలు బలోపేతం చేసేందుకు వినియోగిస్తూ భారత్ ప్రభుత్వం దూకుడు ప్రదర్శిస్తోంది. 

ఆర్థిక, అంతర్జాతీయ వ్యవహారాల్లో చైనా ఆధిపత్యానికి సవాలు విసురుతోంది.అత్యవసర ప్రాతిపదికన టీకా సరఫరా చేయాలంటూ కాంబోడియా ప్రధాని ఇటీవలే భారత్ ప్రభుత్వాన్ని కోరారు. దీనికి వెనువెంటనే స్పందించిన భారత్.. తక్షణం లక్ష డోసులను సరఫరా చేసేందుకు నిర్ణయించింది. చైనా, కాంబోడియా దేశాలు మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి. చైనా సంస్థ సైనో ఫార్మ్ ఆ దేశానికి ఏకంగా 10 లక్షల టీకా డోసులు సరఫరా చేయాల్సి ఉంది. అయితే.. టీకాల ఉత్పత్తిలో భారత్‌కు ఉన్న టీకా సామర్థ్యాన్ని ప్రస్తుత పరిస్థితులకు అనుకూలంగా మలుచుకుంటూ భారత్ తన ప్రతిష్టను పెంచుకుంటోంది. 

ఇప్పటికే మయన్మార్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, మాల్దీవస్ వంటి దేశాలు వీలైనంత త్వరగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు భారత్ ఎంతో సహాయం చేసింది. అక్కడి ఫ్రంట్‌లైన్ వర్కర్ల కోసం టీకాను సరఫరా చేసింది. భారత్‌ టీకా అవసరాలతో పాటూ విదేశాల విజ్ఞప్తులకు కూడా తగు ప్రాధాన్యం ఇస్తూ కేంద్రం ప్రభుత్వం పొరుగు దేశాల్లో తన పరపతి పెరిగేలా చర్యలు తీసుకుంటోంది.

ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: