తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బలపడే విషయంలో కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ప్రధానంగా పార్లమెంటు అధ్యక్షుల ఎంపిక విషయంలో భారతీయ జనతా పార్టీ అధిష్టానం ముందు నుంచి కూడా తప్పులు చేస్తూనే ఉంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత కొన్ని కొన్ని విషయాల్లో భారతీయ జనతా పార్టీ ఘోరంగా విఫలమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విషయంలో కొన్ని అంశాల్లో మాత్రం భారతీయ జనతా పార్టీ నేతలు దూకుడు ప్రదర్శించే లేకపోతున్నారు.

 ప్రధానంగా ప్రజల్లోకి వెళ్లి విషయంలో కొంత మంది నేతలను కలుపుకుని వెళ్లే బండి సంజయ్ తీరుపై భారతీయ జనతా పార్టీ రాష్ట్ర స్థాయి నేతల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. నియోజకవర్గాల్లో విషయంలో కూడా భారతీయ జనతా పార్టీ పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. బండి సంజయ్ అధ్యక్షుడు అయిన తర్వాత భారతీయ జనతా పార్టీలో కనబడకుండా వర్గాలు తయారయ్యాయి అనే వ్యాఖ్యలు కూడా వినబడుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు వస్తున్న వార్తల ఆధారంగా చూస్తే భారతీయ జనతా పార్టీ అధిష్టానం తెలంగాణ మీద ప్రత్యేక దృష్టి పెట్టినట్టు సమాచారం.

పార్లమెంట్ అధ్యక్షులు ఎంపిక విషయంలో భారతీయ జనతా పార్టీ అధిష్టానం జోక్యం చేసుకునే అవకాశాలున్నాయి. రాష్ట్ర పార్టీ నేతలు మాత్రం కూడా అవకాశం ఇవ్వకుండా మేమే ఎంపిక చేస్తాం అని చెప్పినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే క్షేత్రస్థాయిలో కొంతమందిని పంపి నివేదికలు కూడా తెప్పించుకున్నారు అని సమాచారం. ప్రధానంగా సీఎం కేసీఆర్ కు అనుకూలంగా కొంత మంది భారతీయ జనతా పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారని ఆరోపణల నేపధ్యంలో దీని మీద ఎక్కువగా దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. మరి ఇది ఎంతవరకు ఫలిస్తుందో లేదో తెలియదు కానీ త్వరలోనే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వంలో కూడా కొన్ని కీలక మార్పులు చేసే అవకాశాలు ఉండొచ్చని ప్రచారం రాజకీయ వర్గాల్లో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: