ఏపీ రాజకీయాల్లో రోజుకో సెన్సేషనల్ వార్త వెలుగులోకి వస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం స్థానిక ఎన్నికల నేపధ్యంగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల హడావిడి నడుస్తుండగా... వైసీపీ కీలక నేత ఢిల్లీలో మెరవడం సంచలనంగా మారింది. వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు ప్రస్తుతం ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంలోని మంత్రులను ఆలిస్ పనిలో బిజీ గా ఉన్నారు. అదేంటి అని ఆశ్చర్యపోతున్నారా..! ప్రస్తుతం ఏపీ వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు ఢిల్లీలో వరుసగా బిజెపి నేతలను కలవడం సంచలనంగా మారింది. మొన్న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తో భేటీ అయిన ఆయన. తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తో సమావేశం అయ్యారు.

అమిత్ షా ను కలిసిన ఆయన అమరావతి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలి అని కోరినట్లు తెలిసింది. దీనికి ఒకింత ఆశ్చర్యమనిపించినా పేరుకే ఈయన వైసీపీ ఎంపీ, తన సపోర్ట్ అంతా ప్రహి పక్ష పార్టీలకే అని తెలిసిందే. అనంతరం మోడీతో భేటీ అయిన రఘు రామ ఏపీలో దేవాలయాలపై  జరుగుతున్న వరుస దాడులు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇష్యూ వంటి కీలక అంశాల గురించి ప్రస్తావించినట్లు సమాచారం. ఇవన్నీ ఒక ఎత్తయితే... ఓ విషయం విని ప్రధాని మోడీ షాక్ అయ్యారట. ఏపీలో చర్చిల నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం టెండర్లను పిలిచిందని రఘురామ చెప్పగానే, ప్రధాని మోదీ ఆశ్చర్యానికి గురయ్యారట...దీనిపై అయన మాట్లాడుతూ చర్చిల నిర్మాణానికి టెండర్లా...? అని నవ్వారట...!

అంతే కాదు అందుకు సంబంధించిన వివరాలను అందించాలని సూచించారట ప్రధాని. చర్చిల నిర్మాణం కొరకు టెండర్లు అంటే నిజంగా ఆశ్చర్య దగ్గ విషయమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.... మరి ఇంతకీ అది ఏ సందర్భమో... కారణమేంటో అన్నది తెలియాల్సి ఉంది. రఘురా కృష్ణకు వేరే పనిలేదు, అవకాశం దొరికితే చాలు అధికార పార్టీని ఇరికించే పనిలోనే ఉంటారు అని వైసీపీ నాయకులు అంటూ ఉన్నారు. మరి మోదీ దీనిపై  ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారో చూడాలి. పైగా జగన్ ఈ మాటలను కనీసం పట్టించుకోలేదంటే నమ్మండి.

మరింత సమాచారం తెలుసుకోండి: