ఈ కాలంలో చాలామంది ఎదుర్కునే ప్రధాన సమస్యల్లో అధిక బరువు కూడా ఒకటి అనే చెప్పాలి.  అలాగే మానసిక ఒత్తిడి, జంక్‌ ఫుడ్‌ వంటి అలవాట్లు అధిక బరువుకు కారణం కావచ్చని నిపుణులు చెబుతున్నారు.మనం ఆహారంలో ఎన్ని మార్పులు చేసినాగాని ఒక్కోసారి  బరువు ఏమాత్రం తగ్గరు.అలాగే  కొంతమందిలో నడుము చుట్టూ కొవ్వు పేరుకుపోయి (బెల్లీ ఫ్యాట్) సమస్య మరింత కఠినం అవుతుంది. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా బరువు, బెల్లీ ఫ్యాట్ తగ్గకపోతే.. ఇది హార్మోన్ల లోపం కావచ్చని నిపుణులు చెబుతున్నారు. .హార్మోన్ల అసమతుల్యత వల్ల నడుము చుట్టూ కొవ్వు పేరుకుపోయే సమస్యను హార్మోనల్ బెల్లీ అంటారు.  థైరాయిడ్ గ్రంథి పనితీరులో లోపాలు, పీసీఓఎస్, మెనోపాజ్ సమస్యల వల్ల కూడా హార్మోన్ల అసమతుల్యత ఏర్పడవచ్చు. హార్మోనల్ బెల్లీ బారిన పడ్డారని గుర్తించేందుకు కొన్ని మార్గాలు ఉన్నాయి.



అధిక ఒత్తిడి వల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడవచ్చు. మన శరీరంలో ఉండే అడ్రినల్ గ్రంథులు కార్టిసోల్ హార్మోన్‌ను విడుదల చేస్తాయి. కార్టిసాల్ అధిక స్థాయిలో ఉంటే.. రక్తంలో చక్కెర స్థాయులు కూడా పెరుగుతాయి. ఫలితంగా బెల్లీ ఫ్యాట్‌ కూడా పెరుగుతుంది.అలాగే ఒక్కోసారి మనం ఎంత తిన్నాగాని కడుపు నిండిని అనుభూతి రాదు. శరీరంలో ఈస్ట్రోజెన్ హార్మోన్ తక్కువ స్థాయిలో ఉంటే భోజనం చేసిన తర్వాత మళ్లీ ఆకలి వేసినట్లు అనిపిస్తుంది.  అందువల్ల సెక్స్ హార్మోన్ల హెచ్చుతగ్గులను ఎప్పటికప్పుడూ పరీక్షించుకోవాలి.



కొంతమంది చక్కెర శాతం అధికంగా ఉండే తీపి పదార్థాలను ఎక్కువగా తీసుకుంటారు. ఫలితంగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎదురయ్యే అవకాశం ఉంటుంది.దాని  వలన  శరీరం రక్తం నుంచి చక్కెరను గ్రహించలేకపోతుంది. దీనివల్ల శరీర కణాలు శక్తి కోసం ఎదురు చూస్తాయి. ఫలితంగా తీపి తినాలని అనిపిస్తుంది. ఇది హార్మోనల్ బెల్లీ ఫ్యాట్ సమస్యకు దారితీస్తుంది.అలాగే మెనోపాజ్ వల్ల మహిళల్లో కొన్ని సమస్యలు కనిపిస్తాయి. మెనోపాజ్‌ దశలో శరీరంలోని వివిధ భాగాల్లో కొవ్వు పేరుకుపోయే అవకాశం ఉంది. ఈ దశలో ఈస్ట్రోజన్ హార్మోన్ స్థాయులు తగ్గినప్పుడు తొడలు, పిరుదులు, నడుము, పొత్తికడుపు చుట్టూ కొవ్వు పేరుకుపోతుంది.ఇలాంటి సమస్యలు ఏర్పడితే కేవలం హార్మోన్ల అసమతుల్యత వల్లే బెల్లీ ఫ్యాట్ ఏర్పడుతుందని అనుకుని వైద్యుడిని సంప్రదించాలి. !

మరింత సమాచారం తెలుసుకోండి: