అమెరికా.. అంటే ఓ సంపన్న రాజ్యం.. అమెరికా అంటే..ఓ స్వప్నలోకం.. అమెరికా అంటే చాలామందికి డాలర్‌ డ్రీమ్స్.. కానీ.. అమెరికాకు చెందిన ఓ షాకింగ్ న్యూస్.. ఇటీవల బయటకు వచ్చింది. అదేంటంటే.. అమెరికాకు కూడా చాలా ఎక్కువగా అప్పులున్నాయట. అవును మరి.. ఈ రోజుల్లో ఎంత అప్పుంటే అంత గొప్ప అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఇప్పుడు ఇది దేశాలకూ వర్తిస్తుందన్నమాట. అందులోనూ అమెరికా వంటి దేశం.. ఇండియా వంటి దేశాలకు భారీగానే అప్పు పడిపోయిందట.  ఈ విషయాన్ని అమెరికా ప్రజాప్రతినిధులే బయటపెట్టేశారు.


అమెరికా అప్పుల విషయాన్ని రిపబ్లికన్‌ పార్టీ సెనేటర్‌ ఒకరు వెల్లడించారు. అమెరికాకు అప్పులిచ్చిన దేశాల్లో చైనా, జపాన్‌లతో పాటు భారత్‌ వంటి ఇతర దేశాలూ ఉన్నాయని రిపబ్లికన్‌ పార్టీ సెనేటర్‌ అలెక్స్‌ మూనే తెలిపారు. అమెరికా ఒక్క భారత దేశానికి తీర్చాల్సిన రుణమే 21,600 కోట్ల డాలర్లు అంటే సుమారు రూ.15.89 లక్షల కోట్లు ఉందని రిపబ్లికన్‌ పార్టీ సెనేటర్‌ అలెక్స్‌ మూనే తెలిపారు. ఇక ప్రపంచంలోని వివిధ దేశాలకు అమెరికా తీర్చాల్సిన అప్పు మొత్తం లెక్కలు చూస్తే 29 లక్షల కోట్ల డాలర్లట. అంటే.. సుమారు రూ.2134 లక్షల కోట్లు అన్నమాట.


మరి ఈ అప్పు అంతా ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా.. దీనిలో సింహభాగం చైనా, జపాన్‌లకు చెల్లించాల్సిందే ఉందట. రుణభారం భారీగా ఉందని రిపబ్లికన్‌ పార్టీ సెనేటర్‌ అలెక్స్‌ మూనే అమెరికా ప్రతినిధుల సభలో గగ్గోలు పెట్టారు. ఇదంతా ఎందుకు వచ్చిందంటే.. 2 లక్షల కోట్ల డాలర్లతో ప్రతిపాదించిన తాజా ఉద్దీపన ప్యాకేజిని వ్యతిరేకిస్తూ అమెరికా ప్రతినిధుల సభలో రిపబ్లికన్‌ పార్టీ సెనేటర్‌ అలెక్స్‌ మూనే ప్రసంగించారు.


సో.. అమెరికా అంటే.. సంపన్న రాజ్యమే కాదు.. ఓ అప్పుల కుప్ప. అప్పులిచ్చిన వాటిలో అమెరికా మిత్రదేశాలే కాదు.. చైనా, జపాన్‌ వంటివి అగ్రస్థానంలో ఉన్నాయట. ఒక్క చైనాకే లక్ష కోట్ల డాలర్లు.. అంటే.. సుమారు రూ.73 లక్షల కోట్లు చెల్లించాల్సి ఉందట అమెరికా. ఇక  జపాన్‌కూ దాదాపు అంత మొత్తం తీర్చాలట. ఈ అమెరికా అప్పులు 2000 సంవత్సరం నాటికి 5.60 లక్షల కోట్ల డాలర్ల అప్పులు ఉంటే ఒబామా ఎనిమిదేళ్ల పాలనలో అప్పులు డబల్ అయ్యాయట. 

మరింత సమాచారం తెలుసుకోండి: