మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేసారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే అత్యధికంగా ఉపాధి హామీ పనులు చేశాం అని ఆయన అన్నారు. ఈ ఏడాది రాష్ట్రానికి 25.25 కోట్ల పనిదినాలు కేటాయించారు అని ఆయన అన్నారు. అసంపూర్తిగా వున్న సచివాలయాలు, ఆర్బీకె, అంగన్‌వాడీలను వేగంగా పూర్తి చేయాలి అని ఆయన వెల్లడించారు. జల్‌ జీవన్ మిషన్ కింద రాష్ట్రానికి రూ.4వేల కోట్లు కేటాయించారు అని ఆయన చెప్పుకొచ్చారు. ఈ నిధులతో రాష్ట్రంలో ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి అందించాలి అని ఆయన సూచించారు.

వాటర్ గ్రిడ్ పనులను వేగవంతం చేసి మంచినీటి సమస్య లేకుండా చూడాలి అని ఆయన కోరారు. పిఎంజిఎస్‌వై పనుల్లో అటవీశాఖ నుంచి అభ్యంతరాలు వుంటే ప్రభుత్వం పరిష్కరిస్తుంది అని ఆయన స్పష్టం చేసారు. గతంలో జరిగిన ఉపాధి హామీ పనుల్లో అక్రమాలపై విచారణ జరుగుతోంది అని అన్నారు. రూ.5 లక్షల లోపు పనులకు ఇప్పటికే బిల్లులు చెల్లిస్తున్నాం అని ఆయన స్పష్టం చేసారు. రూ.5 లక్షల పైబడిన పనులకు కూడా పెండింగ్ బిల్లులు చెల్లిస్తాం అని అన్నారు. ఇంజనీరింగ్ అధికారులపై ప్రభుత్వం ఎటువంటి కక్షసాధింపు చేయదు అని  స్పష్టం చేసారు.

ఎసిబి కేసులు నమోదు చేస్తారంటూ కొందరు చేస్తున్న ప్రచారం నమ్మవద్దు అని ఆయన స్పష్టం చేసారు. నిజాయితీగా పనిచేసే అధికారులకు ఈ ప్రభుత్వం అండగా వుంటుంది అని ఆయన హామీ ఇచ్చారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు జన్మభూమి కమిటీ ల తో దోపిడీ చేశారు అని ఆరోపించారు. కానీ మేం ప్రతి పధకం  కులాలు, పార్టీలు చూడకుండా అమలు చేస్తున్నాం అని అన్నారు. ప్రతి గ్రామంలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం అని ఆయన చెప్పుకొచ్చారు. అందుకే 80 శాతం పైగా సర్పంచ్ స్థానాలు గెలిచాం అని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో 80 శాతం పైగా స్థానాలు గెలుస్తాం అని ధీమా వ్యక్తం చేసారు. ఎంపీటీసీ, జెడ్పిటిసి ఎన్నికలు ఎప్పుడు జరిగినా 90 శాతం పైగా స్థానాలు గెలుస్తాం అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: