సీబీఐ (సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్విస్టిగేషన్)అనేక వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. వివాదాల్లో చిక్కుకుంటోంది. సమస్యలను ఏరి కోరి తెచ్చుకుంటోంది. పొరుగు రాష్ర్టానికి, మన రాష్ర్టానికి వచ్చే వరకు కేసుల విషయంలో తేడా కనిపిస్తోంది. విచారణ తీరులో మరీ ముఖ్యంగా. అక్కడ ఒక విధంగా, ఇక్కడ ఒక్క విధంగా సీబీఐ నడుచుకుంటోంది. ఇదే ఇప్పుడంతా సీబీఐ పనితీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  రాష్ర్ట వ్యాప్తంగానే కాకుండా, దేశ వ్యాప్యంగా చర్చసాగుతోంది. సీబీఐ యంత్రాంగం రాజకీయ పార్టీల చెప్పు‘చే’తల్లోకి వెళ్తుందన్న ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఉదాహరణగా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న మహారాష్ర్ట, ఉత్తర్ ప్రదేశ్ తీసుకుంటే సీబీఐ తీరు గురించి అందరికీ తెలుస్తోంది. వ్యక్తిగతంగా కక్షసాధింపు చర్యలకు సీబీఐ పూనుకుంటుందనీ అందరూ అనుకుంటున్నారు. పైన పేర్కొన్న రాష్ర్టాలను తీసుకుందాం. దీనివల్ల సీబీఐ వ్యవస్థకు మాయని మచ్చగా రానున్నది. ఒక్కో కేసులో ఒక్కో విధంగా వ్యవహారించడం సీబీఐకి ఉన్న క్రెడిట్ దెబ్బతింటోంది. సీబీఐ తీరుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలు ఆడిస్తున్నట్లుగా సీబీఐ ఆడుతుందనే అపవాదును మూటగట్టుకంటోంది. కొందరి అధికారుల తీరుల వల్ల సీబీఐకి ఉన్న క్రెడిట్ అంతా పోతున్నది. సీబీఐ రాజకీయ నేతల ఒత్తిళ్లకు పని చేస్తుందా? లేక స్వతంత్రగా వ్యవహరిస్తుందా? అంటే రాజకీయ ఒత్తిళ్లకు సీబీఐ పనిచేస్తుందనీ మహారాష్ర్ట సీబీఐ జేడీ బదిలీ, ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి కేసుతో తేలిపోయిందనీ దేశంలోని జాతీయ పార్టీలైనా బీజేపీ, కమ్యూనిస్టు పార్టీలు బహిరంగంగానే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి.  ఇదిలా ఉంటే రాష్ర్ట సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ తీరుపై రాష్ర్టానికి చెందిన వైఎస్ఆర్ పార్ట నేతలు ఢిల్లీలోని కేంద్ర విజిలెన్స్ కమిషన్ చీఫ్ ప్రదీప్ కుమార్ ను కలిసి ఫిర్యాదు చేశారు. జేడీ లక్ష్మానారాయణ రాజకీయ ఒత్తిళ్లకు లొంగి కేసును విచారిస్తున్నారనీ, ఇది మానుకోవాలనీ వైఎస్ఆర్ ఢిల్లీ పెద్దలందరికీ వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఫిర్యదు చేశారు. దీనిపై ప్రదీప్ కూడా స్పందిచారనీ, సీబీఐ జేడీ లక్ష్మీనారాయణకు నోటీస్ ఇచ్చి విచారిస్తామనీ చెప్పినట్లు వైఎస్ఆర్ పార్టీ నేతలు చెప్పారు. కమ్యూనిస్టులు, బీజేపీ, వైఎస్ఆర్, త్రుణమూల్ కాంగ్రెస్ నేతలందరూ సీబీఐ తీరును పూర్తిగా తప్పుబడుతున్నారు. దీనికి తోడుగా సీవీసీ చీఫ్ ప్రదీప్ కుమార్ కూడా జేడీ లక్ష్మానారాయణను పిలిపించి మాట్లాడుతామని అనడం చర్చనీయాంశంగా మారింది.  జగన్ ఆస్తులు, ఆయన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన వారిపై సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సాగిస్తున్న తీరుపై వైఎస్ఆర్ పార్టీ నేతలు జాతీయ స్థాయిలో పోరాటాన్ని చేస్తున్నారు. ఇదే క్రమంలో మహారాష్ర్టలో జరిగిన ఆదర్శ్ సొసైటీ కుంభకోణంలో మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ పై ఛార్జిషీటును దాఖలు చేసిన ఆ రాష్ర్ట సీబీఐ చీఫ్ సింగ్ ను బదిలీ చేయడం...ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి ఆదాయానికి మించిన ఆస్తుల కేసును కొట్టివేయడం...రాష్ర్టం విషయానికి వచ్చే వరకు జగన్ కేసుపై మరో విధంగా వ్యవహరిస్తుండటంతో కేంద్రంలోని సర్కార్ సీబీఐని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటుందనీ అటు జాతీయ పార్టీలు, ఇటు ప్రాంతీయ పార్టీలు అంటున్నాయి. ప్రజలు కూడా ఇది నిజమేనని నమ్ముతున్నాయి. మాయా కేసును కొట్టివేయడం...మహారాష్ర్ట జేడీనీ బదిలీ చేయడం...రాష్ర్టానికి చెందిన జగన్ కేసు విషయంలో రోజుకో ఛార్జిషీటును దాఖలు చేస్తున్న తీరుతో రాష్ర్టంలో సీబీఐ జేడీ సీబీఐ మాన్యువల్ కు విరుద్దంగా విచారణ చేస్తున్నారనీ, ఇది చట్ట విరుద్దమనీ, సీవీసీ ప్రదీప్ చెబుతున్నట్లుగా, సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ పై విచారణ చేపడితే అనేక విషయాలు బయటపడే అవకాశాలు లేకపోలేదనీ పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటే ఒక విధంగా, లేకుంటే మరో విధంగా వ్యవహరించడం అనే దానిని అందరూ తప్పుబడుతున్నారు. రాష్ర్టపతి ఎన్నికల్లో మద్దతు ప్రకటించిన వారి పట్ల ఒక విధంగా మిగతా వారి విషయంలో మరో విధంగా వ్యవహరించడం సీబీఐకి తగదని బీజేపీ అంటోంది.  రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీ సీబీఐని వాడుకుంటుందోనీ, ఇది మంచి పరిణామాం కాదనీ అంటోంది. మొత్తానికి సీబీఐ జగన్ కేసు విషయంలో అనేక ఆరోపణలు ఎదుర్కొంటోంది. వివాదాలకు కేంద్రబిందువుగా మారింది. ఇదే కొనసాగితే రానున్న రోజుల్లో సీబీఐకి ఉన్న క్రెడిట్ పోవడం ఖాయమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కేసును కేసుగా కాకుండా, రాజీకీయ ఒత్తిళ్లకు లొగ్గి రాజకీయంగా విచారిస్తే రానున్న రోజుల్లో సీబీఐ ప్రజల్లో అభాసుపాలు కావడం తథ్యం. 

మరింత సమాచారం తెలుసుకోండి: