అంతర్జాతీయ మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉన్న ఎర్రచందనం అక్రమ రవాణాకు గుంటూరు జిల్లా సురక్షిత మార్గంగా మారింది. ఈ వ్యావహారానికి కొందరు స్థానిక వ్యాపారులు, అధికారులు మద్దతు ఇస్తున్నట్లు తెలుస్తుంది. ఎర్రచందనం అక్రమ రవాణా నివారణకు నెల్లూరు, చిత్తూరు, జిల్లాల్లో పెద్ద ఎత్తున చెక్ పోస్ట్ను ఏర్పాటు చేశారు. దీంతో స్మగ్లర్లు గుంటూరు జిల్లాను స్థావరంగా చేసుకుని ఎర్రచందనం దుంగలను పెద్దగా నిలువ చేసినట్లు తెలిసింది. ఇక్కడ నుంచి నిర్ధేశించిన చోటుకు చేర్చాలన్నది. స్మగ్లర్ల వ్యూహం. చిలకలూరిపేట, గుంటూరు, మంగళగిరి, తెనాలి,బాపట్ల వంటి ప్రాంతాల్లోని శివారు టింబర్ డిపోల్లో వందలాది టన్నుల ఎర్రచందనం దుంగలను దాచినట్టు తెలిసింది. ఇక్కడనుంచి ఎర్రచందనం దుంగలను సముద్ర తీరానికి చేరవేస్తున్నారు. అక్కడ నుంచి నాటు పడవలు, మరబోట్లు ద్వారా చెన్నైరి తరలిస్తున్నారు. ఎర్రచందనం రవాణాకు గుంటూరు జిల్లాను ఎంచుకోవడం వెనక అది సమద్ర తీరానికి చేరవగా ఉండటమే అసలు కారణం, గత ఏడాదిన్నర కాలంలో నెల్లూరు జిల్లానుంచి గుంటూరు జిల్లాకు తరలిస్తున్న సుమారు 150 టన్నుల ఎర్రచందనాన్ని అధికారులు పట్టుకొని 25 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల చర్యలు నామమాత్రంగా ఉండటంతో ఎర్రచందనం పెద్ద ఎత్తున గుంటూరు జిల్లాకు చేరుతుంది.   

మరింత సమాచారం తెలుసుకోండి: