బ్రిటన్ లో 50 ఏళ్లు దాటిన ప్రతి ఒక్క పౌరుడికి మూడో డోస్ వ్యాక్సిన్ అందించడానికి ప్రభుత్వం సిద్ధమయింది. శరదృతువు కాలంలో అనగా సెప్టెంబర్ 1 నుంచి నవంబర్ 30 లోపు మూడో డోస్ వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేసి క్రిస్టమస్ పండుగ లోపు దేశంలో కరోనా ని పూర్తిస్థాయిలో నిర్మూలించాలని యూకే ప్రభుత్వం కంకణం కట్టుకుంది. క్రిస్టమస్ పండుగ రోజు ఎవరూ కూడా కరోనా కి భయపడకుండా ఘనంగా వేడుకలు జరుపుకోవాలనే ఉద్దేశ్యంతో వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా పూర్తి చేసేందుకు బ్రిటన్ ప్రభుత్వాధికారులు సిద్ధమయ్యారని తెలుస్తోంది.


ఇంగ్లాండ్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ క్రిస్ విట్టి మూడవ డోసు వ్యాక్సినేషన్ కోసం రెడీ చేసిన రెండు ట్రయల్స్ ఆప్షన్స్ ని పర్యవేక్షిస్తున్నారు. వాటిలో ఒక ఆప్షన్ కరోనా కొత్త వేరియంట్లను ఎదుర్కొనే సామర్థ్యం కలిగినది ప్రజలకు ఇవ్వడం కాగా.. రెండవ ఆప్షన్ ఆల్రెడీ ప్రజలకి రెండు డోసులుగా ఇచ్చిన ఫైజర్-బయోఎంటెక్, ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా, మోడెర్నా వ్యాక్సిన్ లలో ఏదో ఒకటి ఇవ్వడం. 



బ్రిటన్ లో మొత్తం జనాభా 66 కోట్లు కాగా.. 3 కోట్ల 46 లక్షల ప్రజలకు ఆల్రెడీ ఫస్ట్ డోసు కరోనా వ్యాక్సిన్లు ఇచ్చినట్టు ప్రభుత్వ గణాంకాలు మంగళవారం రోజు వెల్లడించాయి. అంటే సగం మంది జనాభా కి బ్రిటన్ ప్రభుత్వం మొదటి వ్యాక్సినేషన్ వేసిందని చెప్పుకోవచ్చు. యూకే లో మొత్తం 8 వేర్వేరు కరోనా వ్యాక్సిన్ లను అభివృద్ధి చేశారు. ఐతే ప్రస్తుతం యూకే లో ఎనిమిది వేరువేరు వ్యాక్సిన్లు సంబంధించి మొత్తం 51 కోట్ల డోసులు ఉన్నాయని గణాంకాలు పేర్కొంటున్నాయి.



ఈ ఏడాది చివరిలో నిర్వహించే బూస్టర్ వ్యాక్సినేషన్ కార్యక్రమానికి ముందస్తుగా దేశం యొక్క కరోనా డోసుల సరఫరాను రెట్టింపు చేసే లక్ష్యంతో ఫైజర్ /బయోఎంటెక్ టీకా యొక్క 60 మిలియన్ల డోసులను బ్రిటన్ కొనుగోలు చేస్తుందని ఆరోగ్య మంత్రి మాట్ హాన్కాక్ కొద్ది రోజుల క్రితం చెప్పుకొచ్చారు. ఇకపోతే దేశంలో ప్రజలకు ఇచ్చే 3 వ్యాక్సిన్ లలో ఫైజర్ వ్యాక్సిన్‌ ఒకటి కాగా..  100 మిలియన్ల ఫైజర్ వ్యాక్సిన్‌ డోసులను బ్రిటన్ ప్రభుత్వం ఆర్డర్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: