గత కొన్నేళ్లుగా తన వారసుడుని రాజకీయాల్లో సక్సెస్ చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు గట్టిగా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే టీడీపీ అధికారంలో ఉండగా ఎమ్మెల్సీని చేసి, మంత్రి పదవి కూడా ఇచ్చారు. అయితే ఇదే టీడీపీకి బాగా మైనస్ అయింది. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకుండా, దొడ్డిదారిన ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేయడం ఏంటని వైసీపీ నుంచి విమర్శలు వచ్చాయి. అలాగే లోకేష్‌గా మంత్రిగా ఎలాంటి పనితీరు కనబర్చారో తెలియదుగానీ, టీడీపీ నాయకుడుగా మాత్రం ఫెయిల్ అయ్యారు.


సరిగ్గా మాటతీరు లేకపోవడం వల్ల ఆయన్ని ప్రత్యర్ధులు పప్పు అని ఎద్దేవా చేశారు. అలాగే ఆయన బాడీ తీరుపై కూడా కామెంట్లు చేశారు. ఇక ఇలా విమర్శలు వస్తున్న నేపథ్యంలో 2019 ఎన్నికల్లో లోకేష్ మంగళగిరిలో పోటీ చేశారు. కానీ గెలుపు దక్కలేదు. ఓడిపోయినా సరే పార్టీ కోసం గట్టిగానే కష్టపడుతున్నారు. అలాగే మాటతీరు, బాడీ తీరు కూడా మార్చుకున్నారు. ఇప్పుడు ఏ విషయమైన సూటిగా, స్పష్టంగా మాట్లాడుతున్నారు.


ఓ రకంగా ఫైర్ బ్రాండ్ నాయకుడు మాదిరి తయారయ్యారు. ఎక్కడకక్కడ వైసీపీ, జగన్‌పై ఫైర్ అవుతున్నారు. తనదైన శైలిలో విమర్శలు చేస్తున్నారు. తాజాగా కర్నూలులో ఇద్దరు టీడీపీ నేతలని ప్రత్యర్ధులు హతమార్చారు. దీంతో లోకేష్ వెంటనే కర్నూలు వచ్చి, చనిపోయిన టీడీపీ నేతల కుటుంబాలని ఓదార్చారు. అలాగే స్థానిక వైసీపీ నేతలపై, జగన్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ఒక మాస్ లాంగ్వేజ్‌తో లోకేష్ విరుచుకుపడ్డారు.


అయితే వైసీపీ నేతలు సైతం మాస్ లాంగ్వేజ్ మాట్లాడతారు. కానీ టీడీపీకి కాబోయే అధినాయకుడుగా లోకేష్...ఇలా మాట్లాడటం సరికాదనే వాదనలు వస్తున్నాయి. అలా మాట్లాడుతున్నంత సేపు కార్యకర్తలకు బాగుంటుంది గానీ, సామాన్య ప్రజలకు నచ్చదని, ఇలాంటి మాటతీరు వల్ల పార్టీకి ఎలాంటి మైలేజ్ పెరగదని అంటున్నారు. రాజకీయాల్లో విమర్శలు ఎప్పుడు నిర్మాణాత్మకంగా ఉండాలని, అలా కాకుండా పరుష పదజాలంతో ప్రత్యర్ధులని దూషించడం వల్ల పార్టీకి ఒరిగేదేమీ లేదని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: