అర్హులైన ప్రతిఒక్కరికీ ప్రభుత్వ పథకాల ఫలాలు అందేవిధంగా వాలంటీర్లు నిరంతరం శ్రమిస్తూ ఉన్నారు. సాధారణంగా అయితే ఆ ప్రాంత పరిధిలో ఉన్న వారికి ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తూ ఉంటారు వాలంటీర్లు. కానీ సీఎం జగన్ లక్ష్యానికి ఎక్కడ తూట్లు పడకూడదనే ఉద్దేశంతో వాలంటీర్లు ఇక తమ పనిలో మరింత కార్యదక్షత కనబరుస్తున్నారు. ఏకంగా ఇతర ప్రాంతాలకు సైతం వెళ్లి వైయస్సార్ రైతు బీమా మరియు... జగన్ ప్రభుత్వం అందిస్తున్న పింఛన్లను సైతం ఇస్తున్న ఘటనలు ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్నాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది.
జగన్ ప్రభుత్వం ప్రభుత్వం తీసుకొచ్చిన వైయస్సార్ బీమా నమోదుకు సంబంధించి ఇటీవలే వాలంటీర్లు చూపించిన చొరవ ప్రశంసనీయం అనే చెప్పాలి. ఇక వైఎస్ఆర్ బీమా నమోదు మండలంలోని గౌరవరం గ్రామం నుంచి ముగ్గురు వాలంటీర్లు హైదరాబాద్ వెళ్లారు. గౌరవరం గ్రామానికి చెందిన 20 కుటుంబాలు ఉపాధి నిమిత్తం హైదరాబాద్లో ఉంటున్నాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వం అర్హులందరికీ వైయస్సార్ బీమా నమోదు చేయాలని ఆదేశించిన నేపథ్యంలో గ్రామ వాలంటీర్లు ఏకంగా హైదరాబాద్ వెళ్లి వైయస్సార్ బీమా పథకాన్ని నమోదు చేయించారు. గౌరవరం గ్రామంలోని పెసర మల్లి శివాజీ, గోపి, దుర్గా రెడ్డి అనే ముగ్గురు వాలంటీర్లు హైదరాబాదులో 20 కుటుంబాలు యజమానుల పేరుతో వైఎస్సార్ బీమా పథకం లో నమోదు చేయించారు. ఇలా ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో ఎంతగానో కృషి చేసిన వాలంటీర్లను అభినందిస్తున్నారు గ్రామస్తులు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి