చిన్నప్పటినుంచి తెలుగు మీడియంలోనే చదువుకోవడంతో ఇక ఇంజినీరింగ్ లాంటి పెద్ద పెద్ద చదువులు చదవడానికి ఇంగ్లీష్ అర్థం కాక బట్టీ పట్టడం రాక ఎంతో మంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఇక అప్పటి వరకు ఎంతో మెరిట్ విద్యార్థులుగా ఉన్నవారు ఇంగ్లీష్ మీడియం అర్థం కాక పరీక్షల్లో ఫెయిల్ అయిన సందర్భాలు కూడా ఎన్నో ఉంటాయి. ఈ క్రమంలోనే ఇక ఇంజినీరింగ్ లాంటి కోర్సులు కూడా అటు తెలుగులో ఉంటే ఎంత బాగుండు అని కోరుకుంటూ ఉంటారు ఎంతోమంది విద్యార్థులు. అయితే ఇలా కోరుకున్నవారు కాస్త గట్టిగానే కోరుకున్నట్టున్నారు. ఎందుకంటే ఇప్పుడు వారి కోరిక నెరవేరింది.
ఇంజనీరింగ్ చదువుకోవాలి అనుకునే వారికి ఒక అదిరిపోయే వార్త చెప్పింది aicte. ఇప్పుడు వరకు కేవలం ఇంగ్లీషులో మాత్రమే ఉన్న ఇంజనీరింగ్ కోర్సును ఇక ఈ విద్యాసంవత్సరం నుంచి వివిధ భాషలలో కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. తెలుగు, తమిళం, మరాఠీ లో కూడా ఇంజనీరింగ్ విద్యను బోధించేందుకు aicte నిర్ణయించింది. ఈ మేరకు అటు అన్ని కాలేజీలకు కూడా అనుమతి ఇచ్చింది. భాష కారణంగా ఏ విద్యార్థి కూడా తాము చదువుకోవాలి అనుకున్న చదువుకు దూరం కాకూడదు అనే ఉద్దేశంతో ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. అయితే ప్రాంతీయ భాషల్లో చదువులు చదువుతున్నప్పటికీ తప్పనిసరిగా నాలుగేళ్లపాటు ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉంటుందని ఇటీవల స్పష్టం చేసింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి