ఏపీలో రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లు శ‌ర‌వేగంగా మారుతున్నాయి. అధికారం వైసిపి దూకుడుతో ప్రతిపక్ష టిడిపి కుదేలవుతోంది. ఇంకా చెప్పాలంటే టీడీపీ ఓడిపోయి రెండు సంవత్సరాలు అవుతున్నా... ప్రతిపక్ష పార్టీకి చెందిన పలువురు కీలక నేతలు, అధికార వైసీపీలోకి క్యూ కడుతున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి ఓడిన సీనియర్ నేతలతో పాటు టిడిపి ఎమ్మెల్యేలు , మాజీ ఎమ్మెల్యేలు , మాజీ ఎంపీలు , పలువురు సీనియ‌ర్లు ఇప్పటికే వైసీపీ గూటికి చేరిపోయారు. ఇక ఇప్పుడు ఆ లిస్టులో నే మ‌రో మహిళా నేత సైతం సైతం చేరిపోయారు. ఆమె ఎవరో కాదు శోభా హైమావతి. ఉత్త‌రాంధ్ర‌లో విజ‌య‌న‌గ‌రం జిల్లాకు చెందిన కీల‌క నేత అయిన ఆమె పార్టీకి ఎంతో విధేయురాలిగా ఉంటూ వ‌చ్చారు.

టీడీపీని వీడుతోన్న సంద‌ర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. గత కొంత కాలంగా స్ధానిక నాయకత్వం నన్ను పార్టీకి దూరం పెట్టింద‌ని.. నా కుమార్తె స్వాతీరాణి పార్టీ మారితే.. నన్ను దూరం పెట్టడం ఎంత వరకు సమంజసం అని ఆమె ప్ర‌శ్నించారు. ఈ క్ర‌మంలోనే తాను ఏ పార్టీలో చేరేది త్వరలో తెలియచేస్తాన‌ని  హైమావ‌తి చెప్పారు. చంద్రబాబునాయుడన్నా, టిడిపి అన్నా నాకు గౌరవ భావమే అని ఆమె స్ప‌ష్టం చేశారు. ఇదిలా ఉంటే శోభా హైమావ‌తి వైసీపీ గూటికి చేర‌డం దాదాపు ఖాయ‌మైంది.

అయితే ఇక్క‌డే అస‌లు ట్విస్ట్ ఉంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో శోభా స్వాతిరాణికి అర‌కు ఎంపీ సీటుపై వైసీపీ నుంచి హామీ వ‌చ్చింద‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది. కురుపాం ఎమ్మెల్యే లేదా అర‌కు ఎంపీ సీట్ల‌లో రెండు ఆప్ష‌న్లు స్వాతి రాణికి ఉన్నాయంటున్నారు. కురుపాంలో పుష్ప శ్రీ వాణి ఉన్న నేప‌థ్యంలో గొడ్డేటి మాధ‌వి సీటుకు ఎర్త్ త‌ప్ప‌ద‌నే అంటున్నారు. ఇక బొత్స స‌త్య‌నారాయ‌ణ తో పాటు పార్టీలో కీల‌క నేత‌ల స‌పోర్టు స్వాతి రాణికి ఉందంటున్నారు.

ఇక విజ‌య‌సాయి రెడ్డి సైతం ఉన్న‌త విద్యా వంతు రాలు అయిన స్వాతిరాణిని ఎస్టీ కోటాలో పార్ల‌మెంటుకు పంపిస్తే... ఆ వ‌ర్గం ప్ర‌జల స‌మ‌స్య‌ల‌పై బాగా స్పందిస్తార‌ని.. ఇది పార్టీకి ప్ల‌స్ అవుతుంద‌ని ఆశిస్తున్నార‌ట‌.

మరింత సమాచారం తెలుసుకోండి: