మాములుగా అయితే భారత రాజ్యాంగం ప్రకారం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పదవీకాలం ఐదేళ్లు. కానీ ఒక్క కర్ణాటక రాష్ట్రంలోని బీజేపీ చరిత్రలో ఒక్క సీఎం కూడా ఐదేళ్లు పరిపాలించినట్లు లేదు. ఒక్కొక్క రాష్ట్రంలో అయితే ఒక్కో సీఎం రెండు మూడు సార్లు కూడా పూర్తిగా ఐదేళ్లు పాలించిన చరిత్ర ఉంది. అయితే బీజేపీకి మాత్రం ఆ భాగ్యం కలగడం లేదు. కారణం ఏదైనా ఏ ఒక్కరు కూడా పూర్తిగా పదవీ కాలాన్ని అనుభవించలేదు. గతంలో కర్ణాటకలో చేసిన సీఎం లు అందరూ కూడా ఏదో ఒక కారణం చేత పదవులను కోల్పోయారు. ఇది కర్ణాటక బీజేపీకి శాపంగా మారిందని అంతా అనుకుంటున్నారు. నిన్ననే లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన యడ్డ్యూరప్ప సైతం అవినీతి ఆరోపణలు మరియు పార్టీలో ఉన్న అంతర్గత విబేధాల కారణంగా స్వతహాగా పదవి నుండి తప్పుకోవాల్సి వచ్చింది.

ఈయన స్థానంలో ఎవరు సీఎంగా అవుతారా అని ఎదురుచూసిన వారికి బీజేపీ అధిష్టానం సరైన షాక్ ఇచ్చింది అని చెప్పాలి. అనూహ్యంగా మళ్ళీ కర్ణాటక రాష్ట్రము యొక్క సెంటిమెంట్ ను కొనసాగిస్తూ లింగాయత్ సామాజిక వర్గానికి చేసిన బసవరాజు బొమ్మయిని తదుపరి సీఎంగా నియమించింది. అయితే ప్రస్తుతం అందరి దృష్టి బొమ్మై అయినా ఐదేళ్లు కొనసాగుతాడా లేదా అన్న దానిపై చర్చించుకుంటున్నారు ? మనము ఇది వరకు చెప్పుకున్నట్లుగా మాజీ సీఎంలు ఎవరూ కూడా ఐదేళ్లు పదవిలో ఉండలేదు. కానీ ప్రజల ఆలోచనలను పసిగట్టి, ప్రజల కోసం పనిచేసే ఏ నాయకుడైనా ఐదేళ్లు కాదు కదా, ఎన్ని సంవత్సరాలైనా సీఎంగా కొనసాగగలరు.

మరి బొమ్మై కూడా యడ్డీలాగా అవినీతి ముద్ర వేసుకునేలా వ్యవహరిస్తాడా ? లేదా బీజేపీ కర్ణాటక చరిత్రలో మంచి పాలనతో సరికొత్త అధ్యయనాన్ని సృష్టిస్తాడా అన్నది చూడాలి. కేంద్ర ప్రభుత్వం ఎంతో నమ్మకంతో బొమ్మైని సీఎం చేసింది. వారి అంచనాలను అందుకునేలా తన పాత్ర పోషిస్తాడా ? గత సీఎం ల మాదిరిగా వారికి భజన చేసే సీఎం లా మిగిలిపోతాడా? చూడాలి. ఇతను కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ ఆర్ బొమ్మై కుమారుడు కావడం కలిసొచ్చే అంశము. మరి ప్రజలు కూడా ఆయనను ఆదరించినట్టే ఆదరిస్తారా ? కేంద్ర ప్రభుత్వం కూడా ఐదేళ్లు సీఎంగా ఉండాలని అనేక అంశాలను పరిగణలోకి తీసుకుని బొమ్మైని ఎన్నుకున్నారు. అయిదేళ్ల సీఎంగా రికార్డు సృష్టిస్తారో లేదో భవిష్యత్తులో తెలియనుంది. కానీ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు రావడానికి ఇంకా కేవలం 3 సంవత్సరాలు మాత్రమే ఉంది. మరి ఈలోపు ప్రజల ఆశీస్సులు పొంది, తన పాలనతో వారిని ఆకట్టుకుని తిరిగి కర్ణాటకలో అధికారాన్ని నిలబెట్టుకుంటే ఇది సాధ్యమవుతుంది. లేదంటే మళ్ళీ పాతకథే.





మరింత సమాచారం తెలుసుకోండి: