కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో దేశంలో విద్య సంస్థలను పునః ప్రారంభించేందుకు కేంద్రం అనుమతించిన విషయం తెలిసిందే. అయితే కరోనా నిబంధనలను తప్పక పాటించాలనే ఆంక్షలు కూడా ఉన్నాయి. అయితే కేవలం హై స్కూల్ చిల్డ్రన్ మాత్రమే స్కూల్ కు వచ్చేందుకు అనుమతించారు. అనగా ఆరవతరగతి నుండి పై క్లాసుల విద్యార్థులు స్కూల్ కి వెళ్లొచ్చు. ఎందుకంటే అయిదవ తరగతి లోపు చిన్నారులకు కరోనా నిబంధనలు పాటించడం కష్టతరం అందుకే ఆరవ తరగతి నుండి పై తరగతుల విద్యార్థులకు మాత్రమే అన్న నిబంధన పెట్టింది ప్రభుత్వం. ఇక ఇదిలా ఉండగా కోవిడ్ ఇంకా పూర్తిగా అంతం కాని క్రమంలో పెద్ద తరగతి విద్యార్థులు అయినప్పటికీ ఏదో ఒక సమయంలో ఎక్కడో ఒక దగ్గర తప్పులు జరిగే అవకాశం ఉంది. పొరపాటున కరోనా వ్యాప్తికి కారకులు కాగలరు.

అయితే ఇలా అనుకోకుండా కరోనా రాకుండా ఉండడానికి పాఠశాల యాజమాన్యాలు కొన్ని జాగ్రత్తలు పాటించగలిగితే ఈ విపత్తు నుండి కొంత మేరకు రక్షించుకోవచ్చు.

* ముందుగా పాఠశాలలో ప్రతి రోజూ ఉదయాన్నే పది నిమిషాల పాటు కరోనా గురించి వారికి అవగాహన కల్పించడం మంచిది.

* ఇక క్లాస్ రూముల్లో ఎటువంటి సందర్భంలోనూ మాస్కులు తీయరాదని హెచ్చరించాలి. అంతే కాకుండా అస్సలు అతిక్రమించరాదని అర్థమయ్యేలా చెప్పడం ద్వారా వాళ్ళు మరింత శ్రద్ధగా ఉంటారు.

* కరోనా నేపథ్యంలో వాష్ రూమ్స్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను పలు మార్లు గుర్తు చేస్తుండాలి. తరగతి గదిలో పిల్లలకి మధ్య గ్యాప్ ను మెయింటైన్ చేయాలి.

* ఒకరి వస్తువులు మరొకరు అసలు ముట్టుకోరాదని ముందుగానే తెలియచేయడం మంచిది. శానిటైజర్ తమతో ఉంచుకొని తరచు జాగ్రత్తగా వాడేలా చూసుకోవాలి.

* తరగతి గదిలో కిటికీలు అన్నీ ఓపెన్ లో ఉంచటం మంచిది. అదే విధంగా ఓపెన్ ప్లేస్ లో క్లాసులు చెప్పే అవకాశం ఉంటే మరీ మంచిది. ప్రతి రోజు అన్ని తరగతులు పిల్లలు స్కూల్స్ వచ్చి రాగానే నోటీసు బోర్డుపై ఉన్నటువంటి కరోనా నిబంధనలను ఒకసారి చదివి తరగతి గది లోపలికి రమ్మని చెప్పాలి.

ఈ విధంగా పలు జాగ్రత్తలు పాటించడం ద్వారా విద్యార్థులకు కరోనా వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: