తెలంగాణలో రాజకీయం అంతా త్వరలో జరగనున్న హుజూరాబాద్ ఎన్నికల చుట్టూనే తిరుగుతోంది. అసలు ఇంత సీన్ జరగడానికి కారణం మన తెలంగాణ సీఎం కేసీఆర్ అంటున్నారు. తెరాసలో మాజీ మంత్రిగా ఉన్న ఈటెల రాజేందర్ ను భూ కబ్జా చేశాడనే ఆరోపణలతో కేబినెట్ నుండి తీసివేయబడ్డారు. అక్కడితో ఈటలను పట్టించుకోకుండా వదిలేసి ఉంటే, ఇప్పుడు పరిస్థితి వేరేలా ఉండేది. కానీ కేసీఆర్ ఈటల రాజేందర్ ను తప్పుగా చిత్రీకరించి తన అనుకూల మీడియాతో పదే పదే ప్రజలలోకి తీసుకెళ్లడంతో, అనుకున్నట్టు జరగక పోగా తనకే మేకై కూర్చున్నాడు. ప్రజల దృష్టిలో ఈటలకు సానుభూతి బాగా వర్క్ ఔట్ అయింది. తద్వారా ప్రజల్లో ఈటల రాజేందర్ హీరోగా మారిపోయాడు. 

ఆ తరువాత జరిగిన పరిణామాలు అందరికీ తెలిసినవే. కట్ చేస్తే ఇప్పుడు ఈటల రాజేందర్ తెరాస ఎమ్మెల్యేగా రాజీనామా చేసి బీజేపీలో జాయిన్ అయ్యి, హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఎలాగైనా గెలిచి తీరాలని సన్నద్ధం అవుతున్నాడు. హుజూరాబాద్ నియోజకవర్గం లోనూ ఈటలకు మద్దతు ఎక్కువ గానే ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఒక రకంగా చెప్పాలంటే కేసీఆర్ చేస్తున్న అనవసరమైన ప్రచారం మరియు ప్రణాళికల కారణం గానే ఈటల రాజేందర్ కు ఈ స్థాయిలో హైప్ వచ్చిందని పలువురు అంటున్నారు.  కేసీఆర్ ఈ నియోజకవర్గంపై తన దృష్టిని నిలపడం కారణంగానే ఈటల హైలైట్ అయ్యారని వినికిడి. 

కానీ ఈటల ఎంత ప్రయత్నించినా... ప్రజల్లో హీరోగా పేరున్నా ... హుజూరాబాద్ లో కేసీఆర్ ను దాటుకుని గెలుపొందడం అంత సులభం కాబోదని కొందరు అంటున్న మాట. హీరోలు కూడా కొన్ని సార్లు సినిమాల్లో ఒడిపోతూ ఉంటారని రాజకీయ విశ్లేషకులు ఈటలను ఉద్దేశించి చెబుతున్నారు. మరి ఈటల అందరి అంచనాలను తలక్రిందులు చేసి తెరాస పై గెలవగలడా అన్నది తెలియాలంటే మరి కొంత కాలం ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: