రాష్ట్రం పరిధిలో ఉన్న నీటి వ్యవహారాలను కేంద్రం ఏంధుకు అజమాయిషీ చేస్తుంది అని ప్ర‌శ్నించారు మాజీ మంత్రి పొన్నాల ల‌క్ష్మ‌య్య‌. బుధ‌వారం ఆయ‌న మీడియాతో ఏర్పాటు చేసిన స‌మావేశంలో మాట్లాడారు. నీటిపై కేంద్రం పెత్త‌నం చేయ‌డానికి చేస్తున్న ప్ర‌య‌త్నం, రాష్ట్రం అందుకున్న రెండు త‌ప్పె అని పేర్కొన్నారు. కేసీఆర్ తెలంగాణ కు ద్రోహం చేస్తున్నారు. చివ‌ర‌కు తెలంగాణ ద్రోహి గా కేసీఆర్ నిలిచిపోతారని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒకేసారి జలయజ్ఞం లో భాగంగా 86 ప్రాజెక్టులు ప్రారంబించాం.
 
వైఎస్ రాజశేఖరరెడ్డి హాయాంలో ఎన్నో ప్రాజెక్టులకు రూపకల్పన చేశాము. కానీ కేసీఆర్ ఇప్పుడు వెలగబెట్టింది ఏమిటీ అని ప్ర‌శ్నించారు.  లక్ష కోట్లు ఖర్చు పెట్టినా కాళేశ్వ‌రం వ‌ల్ల ఎంత లాభం జ‌రుగుతుందో కేసీఆర్ చెప్ప‌గ‌ల‌డా అని ప్ర‌శ్నించారు. అసెంబ్లీ లో ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం ఇవ్వరు.  ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఓంటెద్దుపోకడలు  పోతున్నార‌ని, అవి తెలంగాణకు  ఎంతో నష్టం చేస్తాయ‌న్నారు. తప్పులను  కప్పిపుచ్చుకునేందుకు కొత్త ప్రాజెక్టులు అని ప్ర‌క‌టన‌లు చేస్తార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

 
 తెలంగాణ‌లో కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఒక్క ఎక‌రానికి అయినా నీరు అందించారా అని ప్ర‌శ్నించారు. చ‌రిత్ర‌లో అక్టోబ‌ర్ 14 తెలంగాణ‌కు బ్లాక్‌డేగా నిలిచిపోతుంద‌న్నారు. కేఆర్ఎంబీ పాపం కేసీఆర్‌కు ఊరికేపోద‌ని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా బొగ్గు లేక పవర్ ప్లాంట్ లు మూతబడ్డాయ‌ని, ప‌లు రాష్ర్టాలలో పవర్ కట్ లు కొనసాగుతున్నాయని వివ‌రించారు. అన్ని తెలిసిన బీజేపీ ఎన్ని అవాస్తవాలు ప్రచారం చేసినా.. వాస్తవ పరిస్థితి వచ్చే సరికి జనాలకు నిజం తెలుస్తుంది అన్నారు. ఒకే సారి బొగ్గు రేట్లు పెరిగే అవకాశం లేదు. కేంద్రం దగ్గర భవిష్యత్ ప్రణాళిక లేకపోవడమే..ఇప్పుడు బొగ్గు కొరతకు కారణం అని పేర్కొన్నారు. పాలనను పక్కన పెట్టి, రాజకీయాల పై బీజేపీ దృష్టి సారించిందని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క   మెగావాట్ పవర్ కూడా ఇప్పటి వరకు  ఉత్పత్తి చేయలేద‌ని వెల్ల‌డించారు మాజీ మంత్రి పొన్నాల‌. హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో నిర్వ‌హించే  ఉపఎన్నికలో  బీజేపీ, టీఆర్ఎస్ ల‌కు ఓట‌ర్లు త‌గిన బుద్ధి చెప్పి కాంగ్రెస్‌కు విజ‌యాన్ని అందించాల‌ని కోరారు.    


మరింత సమాచారం తెలుసుకోండి: