ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 లో జరిగిన ఎన్నికల్లో ఎలాగోలా భారీ మెజారిటీతో గెలిచి జగన్ సీఎం అయ్యాడు. కట్ చేస్తే రెండు సంవత్సరాల తర్వాత వైసీపీ పరిస్థితి ఏమంత బాగాలేదు. దీనికి చెప్పుకోవడానికి కారణాలు చాలానే కనిపిస్తున్నాయి. అయితే ప్రధానంగా వైసీపీ నాయకులూ అవలంభిస్తున్న వైఖరి పార్టీ మనుగడకు ప్రమాదముగా మారే అవకాశం ఉంది. జగన్ ఒకవైపు సంక్షేమం పేరుతో ప్రజలకు మంచి చేయాలనీ ప్రయత్నిస్తున్నా కొందరి నాయకుల విభిన్న నిర్ణయాలతో ప్రజాగ్రహానికి లోనవుతోంది పార్టీ. రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానంగా వినిపిస్తున్న అంశం ఇది. ఏ రాజకీయ నాయకుడు అయినా పాలనలో ఉన్నత కాలం ప్రజల ఉన్నతి కోసం కష్ట పడాలి, అంతే కానీ ప్రత్యర్థుల మీద కసి తీర్చుకోవడానికి పదవులను ఉపయోగించకూడదు. ఇది ఎక్కడి వారికైనా వర్తిస్తుంది.

అయితే ఆశ్చర్యకరమైన ఎన్నో నిర్ణయాలు ప్రభుత్వం తీసుకుంటూ ఉండడం పట్ల వైసీపీ కి అభిమానులైన వారు కూడా ప్రశ్నించే స్థాయికి చేరుకున్నారు. కానీ ఇక్కడ ప్రజలకు సైతం అర్ధం కాని విషయం ఒకటుంది. జగన్ ఇలా చేస్తున్నాడా ? లేదా జగన్ కు ఇలాగే చెయ్యాలి... ఇది మాత్రమే చెయ్యాలి అని ఎవరైనా సలహాలు ఇస్తున్నారా ? అంటే అవును ఇది నిజం. ఏ ప్రభుత్వానికి అయినా సలహాదారులు ఉండడం సహజం. అయితే ఈ సలహాదారుల మూలంగానే పార్టీ పరువు బజారున పడుతోంది అన్న సందేహాలు ప్రజల్లోనూ మరియు పార్టీ వర్గాల్లోనూ ఉన్నాయి.

ఇపుడు ఆ సందేహం నిన్న జరిగిన దాడులతో మరింత బలపడుతోంది. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఆఫీసులపైన దాడులు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో వైసీపీ ప్రజల్లో ఇంకా దిగజారిపోతోంది. ఈ ఘటనలు జగన్ కు తెలిసే జరుగుతున్నాయా? లేదా దీని వెనుక ఉన్నది ఎవరు అన్న వివరాలు తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: