హుజురాబాద్ ఉప ఎన్నిక‌కు  సమయం దగ్గర పడుతుండటంతో  ప్ర‌ధాన పార్టీలు ప్రచారం జోరును పెంచాయి. టీఆర్‌ఎస్‌ పై కాంగ్రెస్‌ పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి  విమర్శల వర్షం కురిపించారు. కేసీఆర్‌ తెలుగు తల్లి ముందు మోకరిల్లిండని పేర్కొన్నారు. తెలుగు తల్లిని  తిట్టిన కేసీఆర్ ప్లీనరీలో పెట్టిన స్వాగత తోరణంలో పెట్టింది తెలుగు తల్లినే అని గుర్తు చేశారు. గులాబీ చీడకు పెట్టుబడి పెట్టింది ఆంధ్ర కాంట్రాక్టర్లు అందుకే తెలుగుతల్లి తోరణం పెట్టారని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ కారులను ప్లీన‌రీలో ప్రస్తావించలేదని,  ఎదుగుదలలో కారణం అయిన వ్యక్తులను కూడ‌ గుర్తు చేయలేదని రేవంత్‌ రెడ్డి కేసీఆర్‌పై కామెంట్లు చేశారు. కేజీ నుంచి పీజీ వ‌ర‌కు ఉచిత నిర్భంద విద్య అన్నావు.. దీనిపై స్ప‌ష్టంగా చ‌ర్చ చేయ‌డానికి సిద్ధంగా ఉన్నారా అని ప్ర‌శ్నించారు.

ఈరోజు నిజంగానే అద్భుతాలు ఆవిష్క‌రించి ఉంటే విద్య‌ను అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌తో మీరు ఒక‌వేళ తెలంగాణ విద్యార్థుల‌కు అందించి ఉంటే.. టీచ‌ర్ల‌, లెక్చ‌ర‌ర్ల నియామ‌కాలు, యూనివ‌ర్సిటీల‌లో అసిస్టెంట్ ప్రొఫెస‌ర్లు,   ప్రొఫెస‌ర్లు, వీసీలు నియామ‌కం విష‌యంలో నిధుల కేటాయింపు విష‌యంలో చ‌ర్చ‌కు సిద్దమేనా అని పేర్కొన్నారు. తెలంగాణ తొలి, మ‌లి ఉద్య‌మంలో అగ్ర‌భాగాన నిల‌బ‌డి తెలంగాణ ఉద్య‌మానికి ఉవ్వెత్తున ప్ర‌పంచ దృష్టిని ఆక‌ర్షించిన ఉస్మానియా యూనివ‌ర్సిటీకి నూత‌న రాష్ట్రం వ‌చ్చిన త‌రువాత కేటాయించిన నిధులు ఎన్నో అని చ‌ర్చించాల‌ని స‌వాల్ విసిరారు. అన్నం ఉడికిందా లేదా అని ఒక మెతుకు ప‌ట్టుకుంటే చాల‌ని.. ఉస్మానియా, కాక‌తీయ యూనివ‌ర్సిటీ ఫీజు రియంబ‌ర్స్‌మెంట్, ఉద్యోగ నియ‌మాకాల‌పై ప్ర‌భుత్వం చ‌ర్చకు సిద్ధంగా ఉందా..? అని ప్ర‌శ్నించారు. ఇవాళ మీ చేతుల్లో వంచెన‌కు గురైన విద్యార్థులు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటున్నారు. ఆ చావుల‌న్నీ ప్ర‌భుత్వం చేస్తున్న హ‌త్య‌లు కాదా అని ప్ర‌శ్నించారు. అదేవిధంగా తెలంగాణ ఉద్య‌మంలో అత్యంత కీల‌క‌మైన‌ది నియామాకాలు. ఆనాడు తెలంగాణ ప్రాంత నిరుద్యోగులు ఉన్నారు.

 ఆంధ్ర‌వాళ్ల‌ను వెల్ల‌గొడితే ఇంటికొక్క ఉద్యోగం ఇస్తాన‌ని చెప్పి నిరుద్యోగుల‌ను మ‌భ్య‌పెట్టి.. వంద‌లాది మంది నిరుద్యోగులు ఆత్మ‌బ‌లిదానాలు చేసుకుంటే తెలంగాణ వ‌చ్చింది. శ్రీ‌కాంత్‌చారి, ఇషాన్‌రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, యాద‌య్య‌, సురేష్‌నాయ‌క్‌, కానిస్టేబుల్ కృష్ణ‌య్య లాంటి వారు ఎంతో మంది ఆత్మ‌బ‌లిదానాలు చేసుకున్నార‌ని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన త‌రువాత శాస‌న‌మండ‌లిలో 1ల‌క్ష 7వేల ఖాళీలు ఉన్నాయ‌ని ప్ర‌క‌టించార‌ని పేర్కొన్నారు. ఇంకొక 50వేల ఉద్యోగాలు అద‌నంగా మంజూరు చేస్తాన‌ని, మొత్తం 1ల‌క్ష 50వేల ఉద్యోగాలు సంవ‌త్స‌రంలోపు భ‌ర్తీ చేస్తాన‌ని చెప్పారు. పీఆర్‌సీ కమిటీ చైర్మ‌న్ బిస్వాల్ ఇచ్చిన 1ల‌క్ష 91732 మంజూరైన ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయ‌ని వెల్ల‌డించార‌ని తెలిపారు. తెలంగాణ వ‌చ్చిన‌ప్పుడు 1ల‌క్ష 7వేల ఖాళీలుంటే.. ఇప్ప‌టివ‌రకు దాదాపు 85 ప‌ద‌వీ విర‌మ‌ణ చేశార‌ని పేర్కొన్నారు. ఆనాడు కిర‌ణ్‌కుమార్ రెడ్డి ముఖ్య‌మంత్రి గా ఉన్న స‌మ‌యంలో తెలంగాణ వ‌స్తే ఔట్‌సోర్సింగ్ ఉండ‌ద‌ని చెప్పారు. అదేవిధంగా సింగ‌రేణి కార్మికుల కారుణ‌నియ‌మాకాలు, ఖాళీలు, ఆర్టీసీ కార్మికుల‌ను రెగ్య‌ల‌రైజ్ చేస్తాం అన్నారు.మరింత సమాచారం తెలుసుకోండి: