ఓ వైపు హుజూరా బాద్ ఉప ఎన్నిక దెబ్బ‌తో తెలంగాణ రాజ‌కీయాలు హాట్ హాట్ గా సాగుతుంటే.. మ‌రో వైపు ఇప్పుడు మ‌రో హాట్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్య‌క్షుడు ఆర్‌. కృష్ణ‌య్య త్వ‌ర‌లోనే గులాబీ తీర్థం పుచ్చు కోనున్నార‌ట‌. ఆయ‌న 2014 ఎన్నిక‌ల కు ముందు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ ఎన్నిక‌ల‌లో టీడీపీ అధినేత చంద్ర‌బాబు కృష్ణ‌య్య ను టీడీపీ సీఎం అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించారు. ఆ ఎన్నిక‌ల్లో ఎల్బీ న‌గ‌ర్ నుంచి పోటీ చేసిన కృష్ణ‌య్య ఎమ్మెల్యే గా కూడా గెలిచారు. అయితే టీడీపీ తెలంగాణ లో అధికారంకి రాలేదు.

టీడీపీ ఎమ్మెల్యే గా గెలిచినా కూడా కృష్ణ‌య్య ఎప్పుడూ ఆ పార్టీ కార్య‌క్ర‌మాల్లో యాక్టివ్ గా లేరు. ఇక గ‌త ఎన్నిక‌ల్లో ఆయ‌న పోటీ చేయ‌లేదు. అయితే 2019 ఎన్నిక‌ల కు ముందు మాత్రం ఆయ‌న ఏపీలో వైసీపీని గెలిపించాల‌ని ప్ర‌చారం చేశారు. ఇక కొంత కాలంగా తెలంగాణ లో అధికార టీఆర్ ఎస్ కు అనుకూలం గా ఉంటూ వ‌స్తోన్న కృష్ణ‌య్య ఇప్పుడు గులాబీ గూటికి చేరుకోను న్నార‌ట‌. కేసీఆర్ - కృష్ణ‌య్య మ‌ధ్య ఇప్ప‌టికే చ‌ర్చ‌లు జ‌రిగాయ‌ని తెలుస్తోంది.

పార్టీలో చేరితే కేసీఆర్ ఆయ‌న‌కు ఎమ్మెల్సీ ఆఫ‌ర్ చేశార‌ట‌. కృష్ణ‌య్య‌తో ఇప్ప‌టికే మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ తో పాటు సీనియ‌ర్ నేత , మాజీ ఎంపీ వినోద్ కుమార్ ప‌లు ద‌ఫాలుగా చ‌ర్చ‌లు జ‌రిపిన‌ట్టు టాక్ ? ఇక ఇప్ప‌టికే కృష్ణ‌య్య 120 జాతీయ బీసీ సంఘాల‌తో పాటు బీసీలు అంద‌రూ కూడా గెల్లు శ్రీనివాస్ యాద‌వ్ కు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని చెప్పారు. ఏదేమైనా కృష్ణ‌య్య అధికార టీఆర్ ఎస్ కు అనుకూలంగా మార‌డంతో బీసీ సంఘాలు అన్ని తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. ఆయ‌న త‌న ప‌ద‌వుల కోసం ప‌లు పార్టీలు మారుతూ వ‌స్తున్నార‌ని వాళ్లు విమ‌ర్శిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: