ప్రభుత్వం చెబుతున్న వివరాలు ప్రకారం.. 1973లో చింతపల్లిలో మొదటి గంజాయి కేసు నమోదు అయిందట. అసలు 1973కు ముందే గంజాయిని ఒడిశా సరిహద్దుల్లో పండిస్తున్నారనేది బహిరంగ రహస్యమట. ఇక టీడీపీ హయాంలో ఉవ్వెత్తున గంజాయి మాఫియా రెచ్చిపోయిందని.. సాక్షాత్తూ ఆ పార్టీ నేతలు, టీడీపీ హయాంలో అప్పటి మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు మాట్లాడిన విషయాన్ని ఇప్పుడు వైసీపీ అనుకూల మీడియా గుర్తు చేస్తోంది.
ఇంతకీ గతంలో గంటా ఏం మాట్లాడారంటే.. విశాఖ నుంచే దేశమంతా గంజాయి సరఫరా జరుగుతోంది అని.. దాన్ని అదుపు చేయలేకపోతున్నాం అన్నారు. ఇప్పుడు ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్న వైసీపీ.. దీనిమీద మీరేమంటారని ప్రశ్నిస్తోంది. 2016-17 లోనే ఈ పరిస్థితి ఉంటే చంద్రబాబు ఎందుకు ఉపేక్షించారని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. గంజాయి ఆదాయంలో వాటాల కోసం ఉన్నతస్థాయిలో ఉన్నవారు కూడా కొట్లాడుకుంటున్నారని వార్తలు వస్తే ఎందుకు పట్టించుకోలేదని నిలదీశారు.
ఇప్పుడు టీడీపీ నేతలంతా.. జగన్ అధికారంలోకి రాగానే గంజాయి మొక్కలు పుట్టినట్టు, అక్రమంగా సాగు చేస్తున్నట్లు ఆరోపణలు చేస్తున్నారట. మీ హయాంలో తులసి మొక్కలు సాగు చేశారా? మీరా నీతులు చెప్పేది? డేటా తీసుకుంటే అయిదేళ్ల కాలంలో గంజాయి మీద దాడులు, అరెస్ట్‌లు చూస్తే, దానికన్నా ఈ రెండేళ్ల కాలంలో మా ప్రభుత్వం దాడులు, అరెస్ట్ లు చేయించింది చాలా ఎక్కువ అని మంత్రి కన్నాబాబు వివరించారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి