అయితే.. చంద్రబాబు మొదటి నుంచి మీడియాను నమ్ముకున్న మనిషి.. అసలు రాజకీయ పార్టీలకు కూడా న్యూస్ మానిటరింగ్ వింగ్, మీడియా సెల్ ఏర్పాటు చేయడం బహుశా తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబే ప్రారంభించారని చెబుతారు. అయితే మీడియా మోనో పోలీగా ఉన్న రోజుల్లో అలా చేయడం కుదిరిందేమో కానీ.. ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఇకపై ఎంతగా జాకీలేసి లేపినా చంద్రబాబు లేచేలా కనిపించడం లేదు. గతంలోనూ చంద్రబాబును అవతార పురుషుడుగా చూపించిన పత్రికలు కూడా ఉన్నాయి.
చంద్రబాబు ఏ పర్యటనకు వెళ్లినా.. దానికి మంచి హైప్ లభించేది. కానీ.. ఆ తర్వాత కాలంలో వాస్తవం తక్కువ, బుస్సు ఎక్కువ అనే అభిప్రాయం ప్రజలలో వ్యాపించింది. ఇది ఆయనకే నష్టం కలిగించింది. ఒకసారి చంద్రబాబు అమెరికా వెళ్లారు. ఆయన దిగిన హోటల్ లో ఆనాటి అమెరికా అద్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ బంగ్లాదేశ్ ప్రధానితో భేటీ అయినట్లు అప్పటి తెదేపా అనుకూల పత్రికలు రాసుకొచ్చాయి. అంతే కాదు.. అప్పుడు అమెరికా అద్యక్షుడి కన్నా చంద్రబాబును చూడడానికే చాలా మంది వచ్చారని మరీ మీడియా రాసింది.
అయితే ఇప్పుడు ఇలాంటి మీడియా ట్రిక్స్ పని చేసే రోజులు కనిపించడంలేదు. అందుకే ఆయన ప్రత్యర్ధులు ఇప్పుడు చంద్రబాబుకు జాకీలెత్తి లేపినా టిడిపి గెలవడం కష్టమేనంటున్నారు. ప్రజలలో ఉండదలిచిన వారు సాద్యమైనంతవరకు ఫెయిర్ గానే రాజకీయాలు సాగించాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి