ఇక హుజూరాబాద్ ఫలితం రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పబోతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఓట్ల కోసమే దళిత బంధు పథకం తెచ్చారనీ.. ప్రజలు కేసీఆర్ కుటుంబానికి కాకుండా ఉద్యమకారులకు అండగా నిలవాలన్నారు. ధనిక రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. ఇక ప్రగతి భవన్, తెలంగాణ భవన్ లో తెలంగాణ వ్యతిరేక శక్తులు ఉన్నాయని అన్నారు.
మరోవైపు బండి సంజయ్ కూడా ఏ మాత్రం తగ్గడం లేదు. పెట్రోల్, డీజిల్ పై రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ తగ్గించాలని బీజేపీ చీఫ్ బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్రంలోని కలెక్టరేట్లు, తహశీల్దార్ ఆఫీసుల దగ్గర రేపు నిరసన చేపడతామని ఆయన ప్రకటించారు. అయితే ఇప్పటికే కేంద్రం పెట్రోల్ పై 5రూపాయలు, డీజిల్ పై 10రూపాయలు వ్యాట్ తగ్గించడంతో తెలంగాణ ప్రభుత్వం కూడా తగ్గించాలనే డిమాండ్ తీవ్రమవుతోంది. అయితే వ్యాట్ తగ్గింపుపై ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
ఇక తెలంగాణ రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలు కూడా హుజూరాబాద్ ఇచ్చిన ఉత్సాహంతో మాటల దాడి పెంచారు. అత్యధిక మెజారిటీతో గెలిచిన ఈటల 2023లో టీఆర్ఎస్ పార్టీని ప్రజలు పాతరేస్తారని అంటున్నారు. హుజూరాబాద్ ఉపఎన్నికకు కేసీఆర్ 500కోట్ల రూపాయలు ఖర్చు చేశారని.. అధికారులు నిష్పక్షపాతంగా పనిచేయలేదని విమర్శించారు. టీఆర్ఎస్ కండువా కప్పుకుంటేనే పనులవుతాయని బెదిరించారని చెప్పారు. అధికారులు ప్రజలిచ్చే డబ్బును జీతంగా తీసుకుంటున్నారే విషయాన్ని మరవొద్దని హితవులు పలుకుతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి