గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై దేశవ్యాప్తంగానే తీవ్రమైన ఆందోళనలు చెలరేగుతున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ దేశ్ రోజురోజుకు లక్షల కోట్ల అప్పుల్లో కూరుకు పోతుందని ఆర్ధిక రంగ నిపుణులు కూడా అంచనా వేస్తున్నారు. మరోవైపు రాష్ట్రానికి వచ్చే రాబడి రోజురోజుకు పడిపోతుంది ఉండటం ... అదే సమయం లో సంక్షేమానికి జగన్ ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ ఉండడంతో ... ఏపీ తీవ్రమైన ఊబిలో కూరుకు పోతుంది. తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదాయాన్ని వాస్త‌వంగా అంచనా వేయడంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం విఫలమైనట్టు నిర్మల చెప్పారు.

ఏపీకి సంబంధించి మార్చి 31తో ముగిసిన 2020 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కాగ్ నివేదిక గురించి మాట్లాడిన ఆమె ఏపీ ప్ర‌భుత్వ వైఫ‌ల్యాన్ని నిర్మొహ మాటంగా బ‌య‌ట పెట్టేశారు. బీజేపీ ఎంపీ ఒక‌రు రాజ్య‌స‌భ లో వేసిన ప్ర‌శ్న‌కు ఆమె ఈ ఆన్స‌ర్ ఇచ్చారు. 2015-16తో పోలి చూస్తే 2016-17 లో రెవెన్యూ లోటు పెరగటానికి ప్ర‌ధాన కార‌ణాన్ని కూడా ఆమె చెప్పారు. ఉద‌య్ స్కీం మార్గ‌ద‌ర్శ కాల ప్ర‌కారం డిస్కంల రుణాల‌ను సైతం రాష్ట్ర ప్ర‌భుత్వం స్వాధీనం చేసుకుని.. ఖ‌ర్చు చేయ‌డ‌మే అని చెప్పారు.

ఇక 2019 - 20 వ సంవ‌త్స‌రం లో కూడా ఏపీ రెవెన్యూ లోటు పెర‌గ‌డానికి సంక్షేమ ప‌థ‌కాలే ప్ర‌ధాన కార‌ణం అని కూడా ఆమె చెప్పారు. రాష్ట్ర ప్ర‌భుత్వం కొత్త‌గా ప్ర‌వేశ పెట్టిన అమ్మఒడి.. ఉచిత విద్యుత్తు లాంటి పథకాల తో లోటు బాగా పెరిగి పోయింద‌ని ఆమె తెలిపారు. ఇక 2014 లో రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత ఏపీకి ప‌న్నుల వాటాలో నే కేంద్రం రూ.4.40 లక్షల కోట్ల ఆర్థిక వనరుల్ని అందించామ‌ని నిర్మ‌ల చెప్పారు.

ఇక 2014 లో రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత ఇప్ప‌టి వ‌ర‌కు వివిధ రూపాల్లో ఏపీకి కేంద్రం నుంచి మొత్తంగా రూ.440985కోట్ల మొత్తం వ‌చ్చాయ‌ని ఆమె తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: