విమానాశ్రయాల్లో ఎక్స్ రే ద్వారా కార్గో స్క్రీనింగ్ సమగ్రంగా నిర్వహిస్తున్నది. ముఖ్యంగా అమెరికా, భారత్ ఇరు దేశాలు వ్యూహాత్మక భాగస్వామ్యంతో ఉగ్రవాదంపై పోరాడుతూ ఉన్నాయి. అంతర్జాతీయ, ప్రాంతీయ, ఉగ్రశక్తులను గుర్తించి.. వాటికి ముక్కుతాడు వేయడంలో ఎన్ఐఏతో సహా భారత ఉగ్ర నిరోధక బలగాలు కీలకంగా పని చేస్తున్నాయి. ఐసిస్‌కు సంబంధించిన 34 కేసులను ఎన్ఐఏ పరిశీలించి.. 160 మందిని అరెస్ట్ చేసింది. కేరళ, పశ్చిమబెంగాల్ లో ఈ సంవత్సరం సెప్టెంబర్ నెలలో అరెస్టయిన 10 మంది అందులో అల్‌ఖైదా ఉగ్రవాదులు కూడా ఉన్నారు. గత ఏడాది జమ్మూకాశ్మీర్, ఈశాన్య భారతదేశంతో పాటు భారత్‌లోని మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలలో కూడా ఉగ్ర కార్యకలాపాలు చోటు చేసుకున్నాయి. అయితే భారత భద్రతా దళాలు పెట్రోలింగ్ విస్తృతమైన సముద్ర, భూ సరిహద్దులలో పరిమిత సామర్థ్యాన్ని ప్రదర్శిస్తున్నాయని నివేదిక పేర్కొన్నది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి