లిబియా ఎడారుల్లో కొందరు తప్పిపోయారు.. కాదు చిక్కుకుపోయారు..తెలుగువారే అంతా! రామూ సర్ స్పందిస్తారు..వారిని స్వ స్థలాలకు చేరుస్తారు.. ఫిల్మ్ నగర్ లో కొందరికి తిండి లేదు..లాక్డౌన్ ఆ వేళ. వెంటనే స్పందిస్తారు.. తనవంతు బాధ్యతగా నెల రో జులకు సరిపడినన్ని నిత్యావసరాలు అందించి వారికి అండగా ఉంటారు. రిమ్స్ రోగులకు తిండి లేదు ఆ రోజు లాక్డౌన్ వేళ వెంటనే అడిగిన వెంటనే అన్నదాన క్రతువుకు ముందుకు వచ్చి ఆ వేళ తన సహృదయత చాటి నాన్నను స్మరిస్తారు.. అది
రా ఓ లీడర్ అంటే..నా తమ్ముడు.. బాగా పనిచేస్తాడు..అవును! నా తమ్ముడు బాగా పరిశ్రమిస్తాడు పరితపిస్తాడు నా నేల కోసం నా ప్రజల కో సం..అవును! ఆయనెప్పుడు గెలిచినా ఒక్కటే మాట రాస్తాను అంటాను రాముడే గెలిచాడు అని! అండ్ ద టైటిల్ ఈజ్
ఆధునిక వాంగ్మయం అంతా రామమయం...

మీ
ఎంపీ ఎవరు సర్ ఎంత బాగా మాట్లాడతారు
అని అన్నారొకరు నాతో ..
మా
ఎంపీ మా ఇంటి బిడ్డ సర్
మంచి వాడు చాలా చదువుకున్న వాడు
తెలివి సంకల్పం కలగలిసిన వాడు నా తమ్ముడు సర్
అంటే పొంగిపోయారు ఒకరు..
రామూ అంటే ఇవాళ
బొత్స మొదలుకుని కవితక్క వరకూ
అందరికీ అభిమానమే..వైసీపీలో కూడా సర్ కు ఫ్యాన్స్ ఉన్నారండి
అంటే ఎంత ఆనందించారో నా స్నేహితులు.. నా బృంద సభ్యులు
డియర్ తమ్మూ .. జేజేలు.. దీవెనలు..శతాయుష్మాన్ భవ!

ఇవాళ ఆంధ్రావనిలో ఎంపీలు ఎందరున్నా కూడా ఆయనే ఒక ప్రత్యేకం. దేశ ప్రధాని మోడీ కూడా ఆ
యువ ఎంపీని చూసి పొంగిపోతారు. వెల్డన్ మై బోయ్ అని ప్రశంసించి పిలిచి మాట్లాడి భుజం తట్టి పంపుతారు. ఉద్దానం లాంటి మారుమూల ప్రాంతాల నుంచి దేశ రాజధాని వరకూ ఎందరెందరో అభిమానులు ఇవాళ ఆయన పై
ప్రేమ పెంచుకుంటున్నారు. ముఖ్యంగా పొరుగు తెలుగు రాష్ట్రం తెలంగాణలో కూడా ఆయనకు మంచి అభిమానులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు.

దేశ రాజకీయాల్లో అత్యంత కీలకమయిన బాధ్యతలు మోస్తున్న తెలుగు ప్రాంతంకు చెందిన నాయకుల్లో రామ్మోహన్ నాయుడు ఒకరు.
యువ ఎంపీ రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సీనియర్ పొలిటీషియన్లను కాదని ఈ ప్రాంత ప్రజలు వరుసగా రెండు సార్లు ఆయనను తమ ప్రతినిధిగా ఎన్నుకుని అభిమానం చాటారు. మేం అంతా మా ప్రాంతం అంతా ఆయనను రామూ అనే పిలుస్తాం. ఆ సంక్షిప్తమయిన పేరు మా అందరి
గుండె గూటిలో ఎల్లవేళలా నిక్షిప్తం అనే భావిస్తాం. మంచి కుర్రాడు.. ఏం చెప్పినా వింటాడు.. కష్టం అంటే స్పందిస్తాడు.
నాన్న ఎర్రన్నాయుడి మాదిరిగానే మంచి సమర్థత ఉన్న నాయకుడు. ప్రాంతాలకు అతీతంగా తన వద్దకు ఎవ్వరు వచ్చినా సాయం చేసి పంపి, తన వ్యక్తిత్వం గొప్పదనం చాటుతాడు. ఇవాళ ఆయన బర్త్ డే.. నా తమ్ముడికి శుభాకాంక్షలు చెబుతూ రాస్తున్నానొక పొలిటికల్ సైన్స్ విత్ శంభుమహంతి.
- రత్నకిశోర్ శంభుమహంతి