కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ  ఆంధ్ర ప్రదేశ్ విభాగం విజయవాడలో నేడు 'ప్రజాగ్రహ సభ' పేరిట భారీ బహిరంగ సభ నిర్వహించ నుంది. ఈ సభలో పాల్గోనేందుకు  పార్టీ నేషనల్ లీడర్స్ కూడా ఇప్పటికే విజయవాడకు విచ్చేశారు. మరికొద్ది గంటల్లో ఈ సభ ప్రారంభం కానుంది. దాదాపు ఇరవై మందికి పైగా ప్రసంగీకులు వివిధ అంశాలపై ఉపన్యసించనున్నట్లు  ఆ పార్టీ శ్రేణులు ఇప్పటికే ప్రకటించాయి.
సభలో రాష్ట్ర ప్రభుత్వం తీరును ఎండగటతామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు  తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం తన పేరు వేసుకుని ప్రచారం చేసుకుంటోదని, వాటిని ప్రజలకు వివరిస్తామని  బిజేపి శ్రేణులు తెలిపాయి. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతిపై ప్రజలకు వాస్తవాలని వివరిస్తామని, ఒక్క కొత్త ఫ్యాక్టరీ కూడా ఆంధ్ర ప్రదేశ్ లో అడుగు పెట్టెందుకు ముందుకు రాకపోవడానికి గల కారణాలను వివరిస్తామని వారు తెలిపారు. రాష్ట్రం ఎదుర్కోంటున్న ఆర్థిక సంక్షోభానికి  గల కారణాలు, నిరుద్యోగ సమస్య,  తెలుగు భాషకు జరుగుతున్న అవమానం, అన్యాయం తదితర అంశాలను వక్తలు ప్రజలకు వివరించనున్నారు. సభలో మాట్లాడే వక్తలకు  ఏఏ అంశాలపై మాట్లాడాలి అన్న విషయం పై ఇప్పటికే వారికి ఒక నిర్దేశం చేశారు.

కాగా ఈ సభలో ప్రసంగించేందుకు అమరావతి రైతులను కూడా ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని బిజేపి శ్రేణులు బహిరంగంగా ప్రకటించడం లేదు. సభలో అమరావతి సమస్యపై  అక్కడి ప్రముఖుడు ఒకరు ప్రసంగించే అవకాశం ఉందని మాత్రం నర్మగర్భంగా తెలిపారు.
రాష్ట్రంలో అమరావతి రైతులు దాదాపు 45 రోజుల పాటు రాష్ట్రంలో న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో తిరుపతి యత్ర చేశారు. యాత్ర మరో రెండు జిల్లాలతో పూర్తవుతుందనగా బిజేపి నేతలు నెల్లూరు జిల్లా  వద్ద అమరావతి రైతులకు మద్దతు తెలిపారు. అంతే కాకుండా పెద్ద ఎత్తున విరాళం కూడా అందించారు. నాటి నుంచి యాత్ర పూర్తయ్యే వరకూ ఎక్కడో ఒక దగ్గర బిజేపి నేతలు  వారి పాదయాత్రలో కనిపించారు. మేమూ ఉన్నామని పించారు.  ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ అమరావతి రైతులను కూడా  ప్రజాగ్రహ సభకు ఆహ్వానించిన నేపథ్యంలో వారు ఎంత మేరకు ఈ సభకు హాజరవుతారో చూడాల్సి ఉంది. అమరావతి రైతులకు సంబంధించి ప్రథమ శ్రేణి నేతలు హాజరుకాకున్నా... ద్వితీయ తృతీయ శ్రేణి నేతలు , పెద్ద సంఖ్యలో అమరావతి రైతులు హాజరయ్యే అవకాశం ఉందని బిజేపి శ్రేణులు భావిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

bjp